ఖమ్మం జెడ్పీసెంటర్: బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం తిరిగి చెల్లిం చేందుకు బ్యాంకుఖాతాలకు ఆధార్‌నంబర్‌ను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి తెలిపారు. రుణమాఫీ పథకం లబ్ధిదారుల జాబితా, ఈజీఎస్ కూలీల వేతనాలు, పెన్షన్ తదితర వివరాలపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది రోజు ల్లో రైతుల ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సూచించారు.
ఆధార్ అనుసంధానం అయితేనే రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన రైతులందరికీ ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈజీ ఎస్ వేతనాలు, పెన్షన్‌లను ఆన్‌లైన్‌లోనే చెల్లిం చేందుకు ఆధార్‌ను అనుసంధానించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలన్నారు.
సమగ్ర సర్వే మాదిరిగా పీఎం జన్‌ధన్ యోజన డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని ప్రజలకు జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరుస్తారన్నారు. పంచాయతీల వారీగా ఆధార్ ఉన్నవారు లేనివారిని వేర్వేరుగా విభజించి ఆధార్‌కార్డులు కలిగిన వారికి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ భాస్కర్‌రావు, ఎల్‌డీఎం శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.
రుణమాఫీకి ‘ఆధార్’ తప్పనిసరి
Published Thu, Sep 4 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement