వీఆర్వో నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కారు.
చెన్నూర్ (ఆదిలాబాద్) : వీఆర్వో నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి వీఆర్వో భూమన్నకు సంబంధించిన ఎల్టీసీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలంటూ కొద్ది రోజులుగా ఆయన డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌ను కోరుతున్నారు.
అయితే రూ.5 వేలు లంచం ఇస్తేనే పని అవుతుందని ఆయన మెలిక పెట్టాడు. దీనిపై భూమన్న ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.