ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తమశీల్దార్..
► రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి
► భూసేకరణ డబ్బులిచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్
హన్మకొండ అర్బన్: రెవెన్యూశాఖలో అవినీతి మరో సారి కట్టలు తెంచుకుంది. ఎన్‌హెచ్ భూసేకరణలో భూమి కోల్పోయిన వారి కి పరిహారం అందించేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ.1.30 లక్షలు తీసుకుంటూ వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ టి.శ్రీనివాస్‌గౌడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, బాధితుడు మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం.. హన్మకొండ జులైవాడకు చెందిన రిటైర్డ్ ఎస్సై సీహెచ్ మధుసూదన్‌రెడ్డి 2010లో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఎన్‌హెచ్–163 పక్కన 464 చదరపు అడుగుల స్థలం కొన్నారు. ఆ స్థలం తన కూతురు స్వాతి పేరుతో రిజిస్టర్ చేయిం చారు.
ఈ భూమిలో కొంత మేరకు రోడ్డు విస్తరణలో పోయింది. ఈ భూమి ని ప్రభుత్వం సేకరించినందుకు బాధితులకు పరిహారం చెల్లించాలి. ఈ మేరకు బాధితులకు రూ.7.11లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఇవ్వడానికి వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలోని డీటీ టి.శ్రీని వాస్‌గౌడ్ రూ.2లక్షలు డిమాండ్ చేశారు. ముందు లంచం ఇస్తేనే ఫైల్ మీద సంతకం చేయించి ఇస్తామని చెప్పాడు. దీంతో లంచం ఇచ్చుకోలేక బాధితులు గత నెల 30న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అంతేకాకుండా బాధితులు కలెక్టర్‌కు, జేసీకి ఫిర్యాదుచేశారు.
పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం సు మారు 7 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు రా ఘవేందర్‌రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఇదే రికార్డు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంలో ఇదే రికార్డు. గతంలో కలెక్టరేట్‌లో పట్టుబడ్డ డీపీఓ రూ. 1లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు.
తొమ్మిది నెలలుగా వేధించారు..
మా భూమికి పరిహారం ఇచ్చే విషయంలో సుమారు తొమ్మిది నెలలుగా మమ్మల్ని వేధించారు. ప్రతిరోజు ఉదయం రావడం సాయంత్రం వరకు ఇక్కడే ఉండటం నాకు డ్యూటీగా అయింది. పరిహారం ఇవ్వాలంటే రూ.2లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.1.50 లక్షలకు ఒప్పుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్‌కు తిరిగే క్రమంలో నాకు యాక్సిడెంట్ కూడా అయింది. వేధింపులు భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశా.
– మధుసూదన్‌రెడ్డి , బాధితుడు