వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్
హన్మకొండ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేర కు నడుచుకుంటానని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం మేయర్‌గా ఎన్నికైన అనంతరం కార్పొరేషన్ నుంచి హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వచ్చారు. అమరవీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగ ల్‌ను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని అన్నారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జోరిక రమేష్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం ఆలోచనల మేరకు నడుచుకుంటా
Published Wed, Mar 16 2016 2:28 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement