అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేస్తాం | Achampet nagara panchayat elections | Sakshi
Sakshi News home page

అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేస్తాం

Published Wed, Mar 2 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేస్తాం

అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేస్తాం

పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ధీమా వ్యక్తం చేశారు. మంగళవా రం ఆయన జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ తోపాటు ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుచోట్ల జరిగిన ప్రచార కార్యక్రమాల్లో మంత్రి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. హైదరాబాద్ జీఎంహెచ్‌సీ, నారాయణ్‌ఖేడ్‌లో వచ్చిన ఫలితాలే అచ్చంపేటలో కూడా వస్తాయని తెలిపారు.

జాతీయపార్టీలు అన్ని ఒకవైపుంటే కేసీఆర్ మాత్రం సింగిల్‌గా ఉన్నారని, అన్నివర్గాల ప్రజలకు న్యా యం చేస్తుండటంతో ఎక్కడ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీయే ఎక్కడా లేకుండా పోయిందని, టీడీపీ పలుచబడిందని ఎద్దేవ చేశారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కూడమిగా ఏర్పడిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకిస్తున్న వారు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వస్తుంటే ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, సర్పంచుల సంఘం తాలుకా అధ్యక్షుడు ఎండ్ల నర్సింహగౌడు, అర్జున్‌రావు, రామారావు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement