
అంబేడ్కర్ విగ్రహానికి ఉన్న టీఆర్‌ఎస్ కండువాలు
సాక్షి,అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గల అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం టీఆర్‌ఎస్ కండువాలు వేశారు. ఈ చర్యతో అంబేడ్కర్‌ను అవమానపరిచారని, బాధ్యులపై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీతో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విగ్రహానికి టీఆర్‌ఎస్ కండువాలు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ అరుణ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళి అధికారి కె.ఈదయ్య కండువాలు తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment