సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 44 గంటల ముందే మీడియా ప్రచార, ప్రసార కార్యక్రమాలను ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు దశల్లో జరిగే పోలింగ్ సందర్భంగా ఈ నెల 19, 23, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటల్లోపు టీవీ చానెల్స్, రేడియో తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు అభ్యర్థుల ఎన్నికల సంబంధిత ప్రచార కార్యక్రమాల ప్రసారం ముగించాలని, ఒకవేళ ప్రసారం కొనసాగిస్తే ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ప్రచారం చేసే మీడియా సంస్థలపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment