Terms of use
-
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించే కాలేజీలపై చర్యలు తప్పవని పేర్కొంది. విద్యా సంస్థల భవనాలు, నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీ సెస్ డీజీ, హోం సెక్రెటరీ, జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఎన్ని కాలేజీలు ఉన్నాయి.. ఎన్ని కాలేజీలు లేవు అన్న అంశాలను తేల్చేందుకు ఆ శాఖ తని ఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టడం లేదని చిత్రా రామచంద్రన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరి శాఖ తరఫున వారు నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. హాస్టళ్లు, అకాడమీలు బోర్డు పరిధిలోకి.. అనుమతి లేని హాస్టళ్లు, శిక్షణ సంస్థలు, ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించే అకాడమీలను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, అవన్ని కచ్చితంగా బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై కండిషనల్ అఫిలియేషన్ల విధానం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ, ఇతర నిబంధనల మేరకు లేని భవనాల నుంచి ఆయా కాలేజీలను ఇతర భవనాల్లోకి తరలించాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పాలని నిర్ణయించారు. -
స్థానికులకే 75% ఉద్యోగాలపై నిబంధనలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం నిబంధనలు జారీ చేసింది. వీటిని కర్మాగారాలు, పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద నడిచేవాటితోపాటు జాయింట్ వెంచర్స్‌లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతిక, అత్యంత నైపుణ్యం, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వారిని కూడా తీసుకోవాలి. జనవరి నుంచి మూడు త్రైమాసికాల్లో నియామకాలు చేయాలి. ఈ నియామకాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి కల్పన ట్రైనింగ్– ఫ్యాక్టరీస్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇండస్ట్రీస్ కమిషనర్ మెంబర్‌గా, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీలో పదేళ్లుగా నివశిస్తున్న ఎవరైనా ఈ చట్టం కింద ప్రయోజనం పొందొచ్చు. రేషన్ కార్డు, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఓటర్ ఐడీ కార్డ్, గ్యాస్ కనెక్షన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు ఉండాలి. ఇవి లేకపోతే స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ధ్రువపత్రాన్ని నివాసానికి తగిన రుజువుగా పరిగణించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కంపెనీల్లో స్థానికంగా నివశిస్తున్నవారికి 75% ఉపాధి కల్పించాలి. నైపుణ్యం లేని వారని కంపెనీలు భావిస్తే నోడల్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. నోడల్ ఏజెన్సీ అభ్యర్థులకు తగిన శిక్షణ ఇప్పించి నైపుణ్యాల మెరుగుదలకు కృషి చేస్తుంది. కంపెనీలు, సంస్థల యజమానులు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావించి చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే యజమాని నేరం చేసినట్లు భావించి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి అయితే రూ.50 వేలు జరిమానా విధిస్తారు. -
గీత దాటితే మోతే
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా ఫైన్ మోత మోగనుంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా, శిక్ష రెండూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రివర్గం తీర్మానించింది. ఇకపై చిన్నపిల్లలకు (మైనర్లకు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లితండ్రులకు, సంరక్షులు లేదా వాహనం ఇచ్చిన వ్యక్తికి రూ. 25వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కూడా రద్దు చేసే అవకాశముంది. వారి పిల్లలు ప్రమాదం చేస్తే తల్లితండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ. 10వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులై వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా చెల్లించాలి. ఇక డ్రైవింగ్ లైసెన్సు ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2000 జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలి. సీటు బెల్టు ధరించకపోతే రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ. 2 వేలకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5 వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ. 5 వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడింగ్ చేస్తే రూ. 20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు మార్పు చేశారు. ఇలాంటి నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపవుతాయి. దీనికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది. -
పిల్లల సంరక్షణ మరింత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: బాలల సంరక్షణకు మరింత కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకొస్తోంది. పిల్లల హక్కులకు భంగం కలిగించే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఇప్పటికే అమల్లో ఉన్న జువైనల్ జస్టిస్, పోక్సో తదితర చట్టాలను కట్టుదిట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బాలల సంరక్షణ విధానా న్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా పత్రాలను కేంద్రం రాష్ట్రాలకు పంపింది. దీనిపై సలహాలు, సూచనలు అడిగింది. ఫిబ్రవరి 4 లోగా సమర్పించాలని కోరింది. పిల్లల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే, పెద్దల బాధ్యతలను గుర్తుచేస్తూ పలు నిబంధనలు విధించింది. ఇకపై పిల్లల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను ప్రతీ సంస్థపైనా పెట్టింది. ఉద్యోగ నియామకాల్లోనూ పిల్లల సంరక్షణ అంశాలను ప్రస్తావిస్తూ.. వారిపై వైఖరిని సైతం తెలుసుకోవాలని స్పష్టం చేసింది. విచారించాకే నియామకం... కార్పొరేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సముదాయాల్లో ఉద్యోగాల నియామకాల సమయంలో బాలల సంరక్షణ విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థి వైఖరిని తెలుసుకునేందుకు అతని వ్యవహారాలపై అంతర్గత విచారణ చేపట్టాలి. పిల్లల పట్ల అతని శైలి ఏమిటనేది తెలుసుకున్న తర్వాత నియమించుకోవాలి. ఉద్యోగ అర్హత సాధించిన తర్వాత సదరు అభ్యర్థి నుంచి బాలల చట్టాలకు చెందిన అంగీకారాన్ని తీసుకున్న తర్వాతే విధుల్లో చేరాలి. అవగాహనే కీలకం... బాలలపై హింస, అత్యాచారాలు, దాడులను శూన్య స్థితికి తీసుకురావడమే బాలల సంరక్షణ విధాన లక్ష్యం. ఈ క్రమంలో పిల్లల చట్టాలపై అన్ని సంస్థలు అవగాహనలు చేపట్టేలా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పిల్లల సంరక్షణ విధానాన్ని అన్ని సంస్థలు అన్వయించుకోవాలి. చట్టంపై అవగాహన కల్పిం చేలా కార్యాలయాల్లో బోర్డులు ప్రదర్శించాలి. పిల్లలంటే గౌరవం పెంపొందేలా... ఉద్యోగులు, కాంట్రా క్టు వర్కర్లు వ్యవహరించాలి. చైల్డ్‌లైన్ నంబర్ 1098ను అన్ని కార్యాలయాల్లో విధిగా ప్రదర్శించాలి. పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడినట్లు గురిస్తే వెంటనే చైల్డ్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా అప్రమత్తత కలిగిం చాలి. రాష్ట్రాల అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ బాలల సంరక్షణ హక్కుల విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. -
అక్రమ లే అవుట్లకు అనుమతిస్తే కొరడా
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత నిబంధనల ప్రకారం లేని లే అవుట్లకు అనుమతి ఇస్తే గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని రద్దు చేసే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చింది. నగరాలు, పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2018 మార్చి 31 వరకు ఉండే లే అవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించి.. అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చే ముందు వ్యవసాయ భూమి చట్టం కింద రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లే అవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. గ్రామపంచాయతీలు దీన్ని 7 రోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీ చేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. లే అవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లే అవుట్ నిర్వాహకులకు చెబుతుంది. అనంతరం లే అవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించి డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లే అవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. గ్రామ కంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లే అవుట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లే అవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం రద్దవుతుంది. చట్టంలో క్రమబద్ధీకరణ అంశం.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. లే అవుట్లో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వసతులు లేనప్పుడు అది అక్రమం అవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాత లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువతో పోల్చితే పది శాతం గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంత మొత్తం చెల్లించినా దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 44 గంటల ముందే మీడియా ప్రచార, ప్రసార కార్యక్రమాలను ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు దశల్లో జరిగే పోలింగ్ సందర్భంగా ఈ నెల 19, 23, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటల్లోపు టీవీ చానెల్స్, రేడియో తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు అభ్యర్థుల ఎన్నికల సంబంధిత ప్రచార కార్యక్రమాల ప్రసారం ముగించాలని, ఒకవేళ ప్రసారం కొనసాగిస్తే ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ప్రచారం చేసే మీడియా సంస్థలపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపింది. -
ఆబ్కారీలోనూ ఆమ్యామ్యాలు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రతీ పనికి మామూళ్ల వసూళ్లకు తెగబడిన పోలీసు సిబ్బంది జాబితాను ఇటీవల డీజీపీ విడుదల చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితయే. జాబితాలో పేర్లు ఉన్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతుండగా.. మరో పక్క ఎక్సెజ్ శాఖలోనూ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్ సిబ్బంది వివరాలను స్టేషన్ల వారీగా ఆ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ జాబితాలోని కొందరు సిబ్బందిపై రెండు, మూడు రోజుల్లో వేటు పడొచ్చనే ప్రచారం శాఖలో సాగుతోంది. మొదటి నుంచి అపవాదు.. ఎక్సైజ్ శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మామూళ్లు వసూలు చేయడానికి అలవాటు పడ్డారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. భారీగా వసూళ్లకు పాల్పడుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారనే విమర్శలున్నాయి. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లతో మొదలుకొని కల్లు దుకాణాలకు లైసెన్స్ రెన్యూవల్, కొత్త దుకాణాల అనుమతుల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనలో భాగంగా కొందరు సిబ్బంది చర్యలు తీసుకోవాలని భావిస్తూ డైరెక్టర్ జాబితా తెప్పించుకున్నట్లు సమాచారం. నిబంధనలు తూచ్.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాదారులు రింగ్‌గా ఏర్పడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నెలనెలా మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బందికి గంప గుత్తగా వస్తున్న డబ్బు వస్తుండడంతో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాలన్నీ కూడా చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. ఎమ్మార్పీ ధరలను యథేచ్చగా ఉల్లంఘించడంతో పాటు దాదాపు ప్రతీ వైన్స్‌ను బార్లలా మార్చేశారు. కేవలం పర్మిట్ రూమ్ ఉన్న వైన్స్‌ల్లో మాత్రమే మద్యం తాగేందుకు అనుమతించాల్సి ఉండగా.. ఈ విషయంలోనూ నిబంధనలకు పాతరేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రధాన వైన్స్‌లో పరిశీలిస్తే బార్‌ను తలపిస్తుండడం ఇందుకు నిదర్శంగా చెప్పొచ్చు. ఈ వైన్స్‌లో రెండు, మూడు గదులు ఏర్పాటు చేసి టేబుళ్లు, కుర్చీలతో అచ్చం బార్‌ను తలపిస్తుంది. అంతేకాదు మ ద్యం దుకాణాల్లో గ్లాసులు, తినుబండారాలు అమ్మొద్దనే నిబంధనను ఏ యజ మాని పట్టించుకోకున్నా అధికారులు వదిలేస్తుండడం గమనార్హం. కల్లు లైసెన్సుల విషయంలో పండుగే... గీత కార్మికులు చెట్ల నుంచి కల్లు తీసి అ మ్ముకునేందుకు జారీ చేసే లైసెన్సుల విషయంలో ఎక్సైజ్ సిబ్బంది పండుగ చేసుకుంటారనే విమర్శలున్నాయి. టీఎఫ్టీ(ట్రీ ఫర్ ట్యాపర్–చెట్టు నుంచి కల్లు తీసి నేరుగా అమ్ముకోవడం), ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ(టీసీఎస్ – కనీసం 15 నుంచి 50 మంది వరకు సభ్యులుగా ఏర్పడి ఒక సొసైటీ ద్వారా కల్లు అమ్ముకోవడం)ల లైసెన్సుల జారీ విషయంలో ఎక్సైజ్ సిబ్బంది భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. టీసీఎస్, టీఎఫ్‌టీల లైసెన్సుల విషయంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. మామూళ్లపై ఆరా.. పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 25 మంది సీఐలు, 29 మంది ఎస్సైలు, 61 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 215 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొద్ది మంది ప్రతీనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మద్యం దుకాణాలు, బార్‌షాపులు, కల్లు సొసైటీలు, దుకాణాల ద్వారా ప్రతీనెలా డబ్బులు దండుకుంటు న్నట్లు ఆధారాలతో సహా సేకరించారు. అంతేకాదు మద్యం దుకాణాల రింగ్ లీడర్ల డైరీల ద్వారా ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు అందుతున్నాయనే వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీగా అక్రమాలకు పాల్పడుతున్న కొద్దిమందిపై మొదటగా వేటు వేయాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జాబితా రూపొం దించారనే ప్రచారం సాగుతోంది. -
శుద్ధ మోసం.. మాయాజలం
ఆలేరు : నీటిశుద్ధి పేరిట దోపిడీ జరుగుతోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలు(ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల)పై అధికారుల నిఘా కరువైంది. దీంతో వాటర్ప్లాంట్ల వారు సరఫరా చేసిందే శుద్ధనీరు అన్నట్లుగా ఉంది. వాటర్ప్లాంట్ల యాజమాన్యాలు భార ప్రమాణాల(బీఎస్ఐ) నిబంధనలు పాటించకుండా మినరల్ వాటర్ పేరుతో మాయాజాలం చేస్తున్నారు. 20లీటర్ల నీటికి రూ.10–20 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో ఓ వాటర్‌ప్లాంట్ ద్వారా పోస్తున్న నీటిలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అట్టి వాటర్ ప్లాంట్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నీటి వ్యాపారానికి కళ్లెం వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నిబంధనలకు నీళ్లు.. నిబంధనల ప్రకారం వాటర్ప్లాంట్లలో ఎయిర్ కండిషనర్‌తో పాటు కెమికల్ ల్యాబ్ మైక్రోబయాలజీ ల్యాబ్, ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ అంతా స్టెయిన్లెస్ స్టీల్‌తో ఉండాలి. ఇవేకాకుండా అధికారులు ప్రతి 3 నెలలకొక్కసారి ఆయా ప్లాంట్లలో నీటి నమూనాలను సేకరించి పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లు ఇవ్వడం కానీ అంతకు ముందు ఉంటే కొనసాగించడం వంటివి చేస్తారు. ప్లాంట్ నిర్వాహణతో పాటు ప్యాకెట్లు, బాటిళ్లకు కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారలు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఈ నిబంధనలేవీ పాటించకుండా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. జరుగుతుందిలా.. రంగులేని నీరు కాస్తంత తియ్యగా ఉంటే చాలు. శుద్ది నీరు తయారీ కేంద్రం నడిపేస్తున్నారు. నిబంధనల మేరకు నీటిని శుభ్రం చేయకుండానే అమ్మకాలు చేస్తున్నారు. రూ.10 పెట్టి డబ్బా నీటిని కొంటే 2 రోజుల్లోనే అందులో చిన్నచిన్న క్రీములు తయారవుతున్నాయి. అసలు ఈ నీటిని శుద్ది చేస్తున్నారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిని శుద్ది చేయకుండానే కొన్ని ప్లాంట్ల వ్యాపారులు నీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. సురక్షితం కాని నీటిని తాగడం ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కలరా, టైపాయిడ్, పచ్చ కామెర్లు, మూత్రపిండ వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశముంది. రక్షణ కవచాలతో.. ప్లాంట్‌లోని కార్మికులు తమ చేతులకు స్పిరిట్ రాసుకొని గ్లౌస్ తొడుక్కొని పనిచేయాల్సి ఉంటుంది. శరీరానికి ఆప్రాన్లను ధరించాలి. అయితే ఇవేవీ ప్లాంట్లలో కనిపించవు. ఖరీదైన పరికరాలను సమకూర్చడంలో యాజమాన్యాలు నిబంధనలకు తిరోధకలిస్తున్నాయి. సాధారణ జలాన్ని శుద్ద జలంగా మార్చే ప్రక్రియలో పలు దశల్లో నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమంగా లేకుంటే అనార్థాలు తప్పవు. తయారు చేయాల్సిన పద్ధతి ముందుగా బోరులో నీటిలో ట్యాంకులోకి పంపి క్లోరినేషన్ చేయాలి. కొంత సమయం తరువాత శాండ్ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. తరువాత కార్బన్ ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్ అస్మాసిస్ చేయాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. ఆల్ట్రా వైయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్దిచేసి నమూనాలు తీయాలి. నమూనాలను మైక్రోబయాలజీ, కెమిస్ట్ ప్రయోగశాలల్లో పరీక్షించాలి. ఆ తరువాత క్యాన్లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి. ఫిర్యాదు చేయండిలా.. ప్రమాణాలు పాటించని సంస్థలపై ప్రివెన్షన్ ఆప్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేయాలి. 3 నెలలకొక్కసారి ప్లాంట్లను తనిఖీ చేసి గుర్తింపులేని వాటిని రద్దు చేసేలా జిల్లా ఫుడ్ ఇన్సెపెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు విరుద్దంగా.. ♦ అపరిశుభ్ర వాతావరణం, వంటగదులు, తాత్కాలిక షెడ్లలో నీటిని తయారుచేస్తున్నారు. క్యాన్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. నీటిని శుభ్రపరుస్తున్న ఆనవాళ్లు కనబడడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న క్యాన్లలోనే నీటిని పడుతున్నారు. ♦ వాహనాల్లో నీటిని తరలించేటప్పుడు క్యాన్లకు ఎండ తగలకుండా టార్పాలిన్ పట్టతో ప్రత్యేక ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవి పట్టడం లేదు. ♦ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనుమతిలేని నీటిని వాడుతున్నారు. ♦ క్యాన్లపై తయారీ కేంద్రాల చిరునామాలు, ఫోన్‌నెంబర్లు ప్రచురించడం లేదు. ♦ అధికారులు ఈ నీటి నమూనాలను సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపడం లేదు. ♦ అధికారుల తనిఖీలు లేవు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. సమతుల్యత ఉండాలి నీటిలో ఉండాల్సిన ఖనిజాలు, నీటి పరిణామానికి సమతుల్యంగా ఉండాలి. మోతాదు మించితే వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. మెగ్నిషియం, బేరియం, అల్యుమినియం తదితర ఖనిజాల స్థాయి ఎక్కువైతే రోగాలు సంభవిస్తాయి. సాధారణ నీటిని శుద్ధజలంగా మార్చే ప్రక్రియ పక్కాగా జరగాలి. నీటి ఆమ్ల స్వభావ పరీక్షలకు సంబంధించి కనీష్ట స్థాయి లేకుంటే అల్సర్లు సంభవిస్తాయి.– డా. కె ప్రభాకర్, ఆలేరు -
మద్యం వ్యాపారం.. నిబంధనలు కఠినం
∙ దుకాణం వద్ద సిట్టింగ్ గది తప్పనిసరి ∙ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదని షరతు ∙ గగ్గోలు పెడుతున్న వ్యాపారులు భీమవరం: మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం మద్యం దుకాణాలపై నిబంధ నలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే దుకాణాల వద్ద సిట్టింగ్ గదిని తప్పనిసరి చేయగా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదనే షరతు విధించింది. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నా రు. వాటర్, గ్లాసులు లేకుండా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటుచేయడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 474 మద్యం షాపులు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో దుకాణానికి రూ.11.25 లక్షల చొప్పున ఫీజు రూపంలో వసూలు చేసింది. సుప్రీంకోర్టు నిబం ధనలు, జనా వాసాల మధ్య దుకాణాల ఏర్పాటుపై ఆందోళనల నేపథ్యంలో జిల్లాలో సుమారు 90 షాపుల వరకూ ఇ ప్పటికీ ఏర్పాటుకాలేదు. భీమవరంలో 20 దుకాణాలు, ఆరు బార్లకుగాను 15 షాపులు మాత్రమే ఏర్పాటుచేశారు. సిట్టింగ్ రూమ్‌కు రూ.5 లక్షలు గతంలో మద్యం దుకాణాల వద్ద వ్యాపారులు తమ ఇష్ట్రపకారం రూ.లక్ష చెల్లించి సిట్టింగ్ రూమ్ ఏర్పాటుచేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సిట్టింగ్ రూమ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలని నిబంధన విధించింది. అ యితే సిటింగ్ రూమ్‌ల వద్ద వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదనే షరతు పెట్టింది. దీంతో వ్యాపారాలు దెబ్బతింటాయని దుకాణదారులు ఆవే దన చెందుతున్నారు. రోజుకు సుమారు లక్ష ప్యాకెట్లు మద్యం షాపుల వద్ద రోజుకు సుమారు లక్ష వరకు వాటర్ ప్యాకెట్లు వినియోగించేవారు. ప్రస్తుతం వీటిపై నిషేధం విధించడంతో వాటర్ ప్లాంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైతే సొమ్ములు వసూలు చేయాలని, అంతేగాని వాటర్ ప్యాకెట్లు, గ్లాసులపై నిషేధం విధించడం సరికాదని వ్యాపారులు అంటున్నారు. -
అవినీతి అంతస్తులు
తిరుపతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో తవ్వేకొద్దీ అక్రమాలే నిబంధనలు పాటించకుండా నజరానాగా ప్లాట్లు అంతస్తుకు రూ.లక్ష ఇస్తే నిర్మాణానికి ఓకే తిరుపతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భవన నిర్మాణ యజమానులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చట్టంలోని లొసుగులను అనుకూలంగా మలచి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. చేయి తడిపితే ఎన్ని అంతస్తులయినా నిర్మించుకోవచ్చుననే భావన భవన నిర్మాణదారుల్లో ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను తొలగించకుండా అధికారులు బేరసారాలకు దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక అపార్టుమెంట్లలో ప్లానింగ్ అధికారులు అక్రమంగా, బినామీ పేర్లతో బిల్డర్ల నుంచి ప్లాట్లు రాయించుకుంటున్నారనే విమర్శ అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. ఫలితంగా తిరుపతిలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. తిరుపతి తుడా: తిరుపతి డీబీఆర్ ఆసుపత్రి రోడ్డు ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. అక్కడ బడా నేతలు, వ్యాపార వేత్తలు భారీ అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న అనేక భవనాలకు సరైన అప్రూవల్స్ లేవని తెలిసింది. ఆసుపత్రికి ఆనుకుని నిర్మిస్తున్న భారీ భవనానికి టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ ఫైవ్ కి అనుమతులు పొందారు. అప్రూవల్‌లో మాత్రం సెల్లార్ చూపించారు. దీంతోపాటు ఐదంతస్తులు మాత్రమే నిర్మిస్తామని రికార్డుల్లో చూపించారు. దీని ప్రకారం అనుమతులు తీసుకుని ఆ తరువాతేమో జీ ప్లస్ సెవన్ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఇదే భవనంలోనే అధికారులు సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపణ ఉంది. ఇది మరో నిదర్శనం ఇదే రోడ్డులో నిర్మించిన ఓ టవర్స్‌లో భారీ అక్రమాలు జరిగాయి. జీ ప్లస్ ఫైవ్‌కు అనుమతి తీసుకుని జీ ప్లస్ సిక్స్ అపార్డుమెంట్ను నిర్మించారు. అపార్డుమెంట్ నిర్మాణంలో ఉండగానే రిజిస్ట్రేషన్లు చేపట్టడంతో ముందుగానే అనేక మంది కొనుగోలు చేశారు. ఆరో అంతస్తు నిర్మించడంపై కొనుగోలు దారులు అభ్యంతరం తెలపడంతో ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. తొలగిస్తామని హ్చెరించడంతో ఇక్కడ భారీ సెటిల్మెంట్ జరిగిందని తెలిసింది. ఏకంగా ఖరీదైన రెండు ప్లాట్లను బినామీ పేర్లతో అధికారులకు రాసిచ్చారని కొందరు ప్లాట్ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలోని టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అంతులేదు. పిర్యాదు చేసినా.. పట్టించుకునేవారేరి... నిబంధనలు తెలియక సదరు టవర్స్‌లో తాము ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయాని 2012లో అప్పటి కమిషనర్, తుడా వీసీలకు అపార్టుమెంట్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన ఆరో అంతస్తు కారణంగా ప్రమాదంతో పాటు ఇబ్బందిలను కమిషనర్, తుడా వీసీలు గుర్తించి ఆరో అంతస్తును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్లాట్లు ఉండటంతో ఆక్రమణలను తొలగించే సాహసం చేయలేకపోయారని తెలిసింది. రాజకీయ నాయకుల అండతో ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికీ అసోసియేషన్ నాయకులకు బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కమిషనర్ ఆదేశించినా పట్టించుకోలేదుః అక్రమాలను వివరాలతోపాటు అప్పటి కమిషనర్ సకలారెడ్డి, తుడా వీసీ పెంచల్రెడ్డికి అందజేశాం. ఈ అపార్టుమెంట్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని .. ఆరో అంతస్తును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా తొలగించలేదు. ఫిర్యాదు చేసిన మాపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ అపార్టుమెంట్లో అధికారులకూ ప్లాట్లు ఉన్నాయి. అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నాం. ఆరో అంతస్తులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయించాం. - సుబ్రమణ్యంయాదవ్, అడ్వకేట్, అపార్టుమెంట్ మాజీ అధ్యక్షులు. చర్యలు తీసుకుంటాంః డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో నిర్మిస్తున్న భవనాన్ని తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుంటే చర్యలు తీసుకుంటాం. కొత్తగా రావడంతో గత కమిషనర్ ఇచ్చిన ఆదేశాల గురించి తెలియదు. అపార్టుమెంట్స్‌లో అధికారులకు ప్లాట్లు ఉన్నాయనడంలో నిజం లేదు. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంటే అలాంటి వాటిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -గుణశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, కార్పొరేషన్, తిరుపతి. -
కాసులిస్తే..సై!
విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు నగరం నలుమూలలా ఇదే పరిస్థితి నిబంధనలు బేఖాతరు... టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యం అడ్డగోలుగా అనుమతుల మంజూరు ఈ మహానగరం వాతావరణంతో సహ అన్ని విధాలా అందరికీ అనుకూలమైన నగరం. అక్రమ నిర్మాణాలు జరిపే వారికి మరింత అనుకూల నగరం. ఎందుకంటే కాసులిచ్చి అడ్డగోలుగా నిర్మాణాలు జరిపినా పట్టించుకునే వారుండరు. అధికారుల చేతులు తడిపి.. నిబంధనలకు చెల్లుచీటీ చెప్పి...అంతస్తుల మీద అంతస్తులు వేసుకుంటూ పోయినా...కుప్పకూలితే తప్ప పట్టించుకోరు. నివాస భవనానికి అనుమతి పొంది, వాణిజ్య కాంప్లెక్సులు నిర్మించినా కళ్లు తెరచి చూడరు. చెరువుల ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరిపినా మనకెందుకులే అని మిన్నకుంటారు. స్థలం దరఖాస్తుదారుది అవునో కాదో చూడరు. సర్కారు స్థలంలో నిర్మించినా సర్వే నెంబరు ఒకటే కనుక కరెక్టేననుకుంటారు. భవనం కట్టకముందే కనికట్టుతో బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చిక్కడ. ఆ తర్వాత తాపీగా నిర్మాణం పూర్తిచేసి క్రమబద్ధీకరణా పూర్తిచేసుకోవచ్చు. మూడు రకాల అనుమతులు పొంది...అన్నీ కలిపి క్లబ్ చేసి కట్టడాలు చేపట్టొచ్చు. ఇన్ని అనుకూలతలు ఉండగా.. అక్రమనిర్మాణం జరపకుండా ఉంటారా..?! మహానగరంలో అడ్డగోలు నిర్మాణాలు, జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్వాకాలు..అవినీతి అక్రమాలు..పొంచి ఉన్న ప్రమాదాలపై ‘సాక్షి’ ఫోకస్... సాక్షి, సిటీబ్యూరో: గడచిన దశాబ్దకాలంలో నగర జనాభా, విస్తీర్ణం ఎంతో పెరిగినప్పటికీ, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది పెరగ లేదు. దీంతో ఉన్న కొద్దిమందే ఎక్కువమందికి సేవలందించాల్సిన పరిస్థితి. శివారు మునిసిపాలిటీల విలీనంతో నగర విస్తీర్ణం 170 చ.కి.మీల నుంచి రూ. 625 చ.కి.మీలకు పెరిగినప్పటికీ అందుకనుగుణంగా సేవలు పెరగలేదు. పనుల్లో జాప్యం పెరిగింది. నాణ్యత కొరవడింది. దీంతో తమ పని వేగంగా జరగడం కోసం ముడుపులివ్వడం ప్రజలకు అలవాటైంది. దాన్ని రుచిమరిగిన అధికారులు పైసలు లేనిదే ఫైలు చూడని పరిస్థితికి చేరుకున్నారు. దాదాపుగా జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, టౌన్‌ప్లానింగ్ విభాగంలో తీవ్రస్థాయికి చేరింది. లంచాలు తీసుకుంటూ పట్టుబడినవారిలో, అక్రమాస్తుల వలలో చిక్కిన వారిలో ఈ విభాగం వారే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. అక్రమాలపై చర్యల లేమిని తప్పుపడుతూ హైకోర్టు తీవ్రంగా మందలించిన ఘటనలకూ కొదవలేదు. అయినప్పటికీ ఈ విభాగం తీరు మారలేదు. జీహెచ్ఎంసీలో వారం వారం జరిగే ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదుల్లో 75 శాతం ఈ విభాగానివే. గడచిన ఏడాది కాలంలో 800కు పైగా ఫిర్యాదులు దీనివే. సగం కూడా లేని సిబ్బంది... టౌన్‌ప్లానింగ్ విభాగానికి 412 మంది సిబ్బంది అవసరం కాగా... కేవలం 123 మంది మాత్రమే ఉన్నారు. 289 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 199 టీపీఎస్, 31 బిల్డింగ్ఇన్స్పెక్టర్, 30 టౌన్‌ప్లాన్ సూపర్వైజర్ పోస్టులున్నాయి. దీంతో ఉన్న కొద్దిమందికి పని ఒత్తిడి ఎక్కువ కావడంతో చేయి తడపనిదే పనిచేయని పరిస్థితికి చేరుకున్నారని, లంచాల రుచి మరిగి విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్గడువు ముగిశాక కూడా నగరంలో ఏ దిక్కున చూసి నా లెక్కకు మిక్కిలిగా అక్రమ నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలివీ... ఈస్ట్‌జోన్‌లో బెస్ట్ సంపాదన.. కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ చౌరస్తాలో 60 గజాల స్థలంలో ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల్లో వాణిజ్య భవన నిర్మాణం జరుగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అన్నీ సవ్యంగా ఉన్నా జీ+1 ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, కమర్షియల్ భవనం అయితే రూ.2 లక్షలు, అపార్ట్మెంట్ అయితే రూ.3 లక్షలు, కమర్షియల్ అపార్ట్మెంట్ అయితే రూ.5 లక్షల వరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు, ప్లానర్స్ దండుకుంటున్నారని, లేకుంటే అడుగడుగునా కొర్రీవేస్తున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. వెస్ట్‌జోన్‌లో అడ్డే లేదు.. శేరిలింగంపల్లి-1 సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్‌లో యథేచ్చగాఅక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వంద గజాల ప్లాట్‌లో సెట్ బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్, జేవీ కాలనీ, గఫూర్నగర్, దుర్గం చెరువు ఎఫ్టీఎల్, పత్రికానగర్, శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, నల్లగండ్ల, తారానగర్లలో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని చైన్మన్లు అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నల్లగండ్ల, తారానగర్‌లో ఓ మధ్యవర్తి రూ. 6 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. రెండు ఫ్లోర్లకు మాత్రం అనుమతులు పొంది అధికారుల అండతో మరో రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నారు. గుల్‌మోహర్‌పార్క్ కాలనీ ప్రధాన ముఖ ద్వారం సమీపంలో, భెల్ ఎంఐజీ కాలనీ, నల్లగండ్లలోని జరుగుతున్న నిర్మాణాలే ఇందుకు సాక్ష్యం. శేరిలింగంపల్లి -2 లో ఓల్డ్ ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెడ్డికాలనీ, చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట, మదీనాగూడ, కొండాపూర్, ఖానామెట్, అయ్యప్పసొసైటీ, రవీంద్ర సొసైటీలలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు దాదాపు 70 వరకు ఉన్నట్లు అంచనా. గోకుల్ ప్లాట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారినుంచి టౌన్‌ప్లానింగ్ అధికారులు కోటి రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీపీఎస్‌లు, ఏసీపీలు అక్రమ నిర్మాణదారులతో కుమ్ముక్కై అందినకాడికి దండుకుంటున్నారు. సౌత్‌లోనూ షరా ‘మామూలు’ రాజేంద్రనగర్ సర్కిల్లోని రాజేంద్రనగర్, గోల్డెన్ హైట్స్, ఫోర్ట్‌వ్యూ కాలనీ, హైదర్‌గూడ, అత్తాపూర్, శివరాంపల్లి, సులేమాన్‌నగర్, శాస్త్రీపురం, మైలార్‌దేవ్‌పల్లి, టీఎన్జీవోస్ కాలనీ, గగన్‌పహాడ్ ప్రాంతాల్లో సైతం అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ జోన్ పరిధిలోని పాతబస్తీలోనూ అక్రమ నిర్మాణాలు తక్కువేం లేవు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టు నుంచి ఎలా స్టే తెచ్చుకోవాలో కూడా టౌన్‌ప్లానింగ్ వారే చెబుతున్నారని ఆరోపణలున్నాయి. ఉత్తరాన భారీగా.. వాణిజ్య సముదాయాలెక్కువగా ఉన్న నార్త్‌జోన్‌లోని సికింద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదు. ప్రధాన రహదారులపైనే యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు నామ్కేవాస్తేగా నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సికింద్రాబాద్ సర్కిల్లో గడచిన రెండేళ్లలోనే 1072 అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. మోండా మార్కెట్, రాంగోపాల్‌పేట్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని ఇరుకు సందుల్లో వాణిజ్య భవనాలు వెలుస్తున్నాయి. అధికారులకు లంచాలిచ్చి.. స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతుతో నిర్మాణాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెంట్రల్ జోన్‌లోనూ అదే తీరు.. సంపన్నులుండే ఈ జోన్లో పైసలు ముడుతుండటంతో ఫైళ్లు చకచకా కదులుతాయనే ప్రచారం ఉంది. అదే వేగంతో అక్రమాలు సాగుతున్నాయి. రెంంతస్తులకు అనుమతి పొంది.. ఆరంతస్తులు నిర్మిస్తున్న భవనం గురించి కేంద్ర హోంశాఖ రిటైర్డు సెక్రటరీ ఫిర్యాదు చేసినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. కడకు హైకోర్టు నాశ్రయించారు. నెల రోజుల్లో సదరు అక్రమ నిర్మాణానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. -
నేటి నుంచి ఉచిత ఇసుక
ఆదేశాలిచ్చిన కలెక్టర్ 14 రీచ్‌ల్లో 1.29 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌కొక ఇన్చార్జి ఆఫీసర్ నియామకం నిబంధనలు అతిక్రమిస్తే రూ.లక్ష వరకూ జరిమానా విశాఖపట్నం: ఉచిత ఇసుక తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక చేసిన 14 రీచ్‌లలో మంగళవారం నుంచి ఇసుక తవ్వకాలు..రవాణా జరగనున్నాయి. ఆయా రీచ్‌లలో 1,29,080 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇందుకోసం ఒక్కో రీచ్‌కు ఓ చార్జి ఆఫీసర్‌తో పాటు మరో ఇన్చార్జి ఆఫీసర్‌ను కూడా నియమించారు. వీరి అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే క్యూబిక్ మీటర్‌కు ట్రాక్టర్‌కైతే రూ.250, లారీకైతే రూ.100 చొప్పున స్థానిక రీచ్ ఇన్‌చార్‌జలను సంప్రదించి లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. లోడింగ్ చార్జీలు మినహా ఎలాంటి సీనరేజ్, ఇతర చార్జీలు చెల్లించాల్సినవసరం లేదు. ఇసుక తీసుకువెళ్లే వారు వాహనంతో పాటు తమ ఆధార్‌కార్డు, ఫొటో కాపీని సంబంధిత ఇసుక రీచ్ ఇన్చార్జికి ఇచ్చి రికార్డు చేసుకోవల్సి ఉంటుంది. ఈ రీచ్‌ల్లో అందుబాటులో ఉన్న ఇసుకను పూర్తిగా వ్యక్తిగత అవసరాలైన గృహ నిర్మాణం, వ్యక్తిత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి. స్థానికంగా జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతించారు. రీచ్‌ల్లో వాల్టా చట్టానికి లోబడి ఇసుకను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇవీ నిబంధనలు..: వంతెనలు, కల్వర్టులు, సాగునీరు, తాగునీరు భూగర్భ జల , నీటిపారుదల నిర్మాణాలు, రాష్ట్ర, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర వాటికి 500 మీటర్ల వరకూ ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడానికి వీల్లేదు. ఏపీ వాల్టా, పర్యావణ నిబంధనల మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు అనుమతిస్తారు. కూలీలతోనే తవ్వకలు జరపాలే తప్ప ఎక్కడా యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదు. నిర్మాణ రంగంలో అవసరమైన దానికంటే ఇసుక నిల్వ ఉంచ కూడదు. ఇసుకను ఫిల్లింగ్ నిమిత్తం ఉపయోగించడానికి వీల్లేదు. అంతరాష్ట్ర ఇసుక రవాణాను నిషేధించారు. ఇసుక అమ్మకం, నిల్వలతో వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేసి విక్రయిస్తే సీజ్ చేస్తారు. రీచ్‌ల్లో తవ్వకాలను సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఆ తర్వాత రీచ్‌లు మూసివేస్తారు. రాత్రిపూట తవ్వకాలు కానీ.. లోడింగ్ చేయడం కాని పూర్తి నిషేధం. ప్రకటించిన ఇసుక రీచ్‌ల నుంచి కాకుండా ఇతర రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకం జరపడానికి వీల్లేదు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. తీవ్రతను బట్టి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది. వాహనాలు, యంత్రాలను జప్తు చేస్తారు. పునరావృతమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. -
మేజర్ల ఆధునికీకరణ మమ!
పనుల్లో బయటపడుతున్న డొల్లతనం సగం పైగా బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లు గ్రావెల్‌కు బదులు నల్లమట్టి.. చిట్టడవిని తలపిస్తున్న కరకట్టలు ఆందోళనలో రైతులు పల్నాడులోని ఎనిమిది మేజర్ కాల్వల ఆధునికీకరణ పనులు అధ్వానంగా ఉన్నాయి. గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాల్సినచోట కాల్వలో తీసిన మట్టిని పోశారు. కొలతల ప్రకారం వెడల్పు చేయలేదు. లోతు తీయడంలో నిబంధనలు పాటించడంలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలు తీసుకుని మిన్నకుండి పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారంపూడి: కారంపూడి ఓఅండ్ఎం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనిమిది మేజర్ల ఆధునికీకరణకు రూ.22 కోట్లు కేటాయించారు. డీసీ-3 పరిధిలోని రామాపురం, మిరియాల, చర్లగుడిపాడు మేజర్ల ఆధునికీకరణకు రూ.13 కోట్లు, కేసానుపల్లి, పెదకొదమగుండ్ల, జానపాడు, గుత్తికొండ, కోటనెమలిపురి మేజర్లకు రూ.తొమ్మిది కోట్లతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభయ్యాయి. మొదటి దశలో కరకట్టలపై కంప తొలగించడం, కాల్వ లోతు తీయడం, కరకట్టలను పట్టిష్టం చేసి వెడల్పు పెంచడం లాంటి పనులు పూర్తయ్యాయనిపించారు. దాదాపు రూ.12 కోట్ల వరకు బిల్లులు డ్రా చేశారు. నిబంధనలకు నీళ్లు.. అయితే ఈ పనులు అధ్వానంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీలతో కాల్వల లోపల, కరకట్టలు గీరుకుంటూ వెళ్లారు. కాల్వలో తీసిన మట్టిని కట్టపై పోశారు. కాల్వ పక్కన లభ్యమైన నల్ల మట్టినే కట్టలపై పోసి సరిచేశారు. వాస్తవంగా గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాలి. గ్రావెల్ తెచ్చి పోయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎక్కడ మట్టి అక్కడే సరి చేశారు. కరక ట్టలను ఆరు, మూడు మీటర్లు చొప్పున వెడల్పు చేయాల్సి వుండగా అది చాలా చోట్ల జరగలేదు. కాల్వ లోతు తీయడంలోనూ నిబంధనలు పాటించలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలకు ఆశపడడంతో పనులపై పర్యవేక్షణ కొరవడిందని అంతా ఆరోపిస్తున్నారు. అసలు కాంట్రాక్టర్లకు లాభం ఇచ్చి పలువురు సబ్ కాంట్రాక్టులకు తీసుకోవడం నాణ్యతా లోపాలకు మరో కారణం. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పనితీరు కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం అవుతోంది. బయట పడుతున్న డొల్లతనం... ఆ పనుల మొత్తాన్ని పరిశీలిస్తే.. పెదకొదమగుండ్ల మేజర్ కాల్వ కట్టలపై కంపచెట్లు అడవిని తలపిస్తున్నాయి. కొద్దిపాటి వానకే కర కట్టలు బురదమయం అవుతున్నాయి. రామాపురం మేజర్ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా వుంది. మిగతా మేజర్లది దాదాపు ఇదే పరిస్థితి. ఇటీవల మెయిన్ కెనాల్‌కు తాగునీరు వదిలినప్పుడు కొదమగుండ్ల మేజర్‌కు షట్టర్ లేక కాల్వకు నీరు వచ్చింది. ఆ నీరు అర కిలోమీటరు లోపే లీకుల ద్వారా బయటకు పోయింది. గతేడాది పూర్తి స్థాయిలో నీరు వదిలితే ఒక్క పీకేజీ మేజర్‌కే మెయిన్ కెనాల్ నుంచి ఎన్ఎస్పీ కాలనీ వరకు నాలుగుసార్లు గండ్లు పడ్డాయి. నీరు సరిగా ముందుకు పారక నీరు కరకట్టలపై పారాయి. కాల్వల లోపల కూడా చెట్లు పెరిగాయి. ఇలా అయితే మేజర్ల పరిధి లో పెరిగిన ఆయకట్టుకు నీరు అందడం అసాధ్యం. ఎంతోకాలంగా నీరందక ఇబ్బంది పడుతున్న చివరి భూముల రైతుల సమస్యలు తీరేలా లేవు. నూతన సాగు నీటి సంఘాలు పనులు సక్రమంగా జరిగేలా శ్రర్ధ చూపాల్సిన అవసరం వుంది. ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యత.. కాల్వలకు గండ్లు పడినా, ఇతర నాణ్యతా లోపాలకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలి. ఐదు సంవత్సరాల వరకు కాల్వల మరమ్మత్తులు వారే చేయాలి. కాల్వ కట్టలపై జంగిల్ క్లియరెన్స్ చేయిస్తాం. - నాగేశ్వరావు, ఏఈ, ఎన్ఎస్పీ -
‘తారు’లో తిరకాసు!
ఖజానాకు చిల్లుపెట్టేందుకు అధికారుల వ్యూహం కాంట్రాక్టర్లకు రూ.33 కోట్లు దోచిపెట్టేందుకు ఎత్తుగడ రోడ్ల నిర్మాణంలో స్టోన్డస్ట్కు బదులు సిమెంట్ కలపాలని నిబంధన కమీషన్ల దందా పెంచుకునేందుకేనని వెల్లువెత్తుతున్న ఆరోపణలు హైదరాబాద్: తారు రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు పంచాయతీరాజ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు! గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనల్లో సరికొత్త మెలిక పెట్టారు. బీటీ తయారీలో స్టోన్ డస్ట్‌కు బదులు సిమెంట్ కలపాలంటూ పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర సర్కారుపై రూ. 33 కోట్ల అదనపు భారం మోపారు. ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లు సైతం పంచాయతీరాజ్ రోడ్లు చేపట్టేందుకు క్యూ కడుతున్న తీరు చూస్తే ఈ తారు తిరకాసులో ఏం జరిగిందో తేలిపోతుంది. కమీషన్ల దందా పెంచుకునేందుకే అధికారులు ఈ జిమ్మిక్కులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని నిబంధన... ఎంఆర్ఆర్ గ్రాంటు నిధులతో రాష్ట్రంలో 12,006 కిలోమీటర్ల రోడ్డు పనులకు ప్రభుత్వం గతేడాది నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.1,766.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే బీటీ రోడ్లకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల తయారీ డేటాలో ఇంజనీరింగ్ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు శాతం సిమెంట్‌ను జత చేయాలని పేర్కొన్నారు. సాధారణంగా బీటీ మిశ్రమంలో రెండు శాతం స్టోన్ డస్ట్‌ను కలుపుతారు. రాష్ట్రంలోని బీటీ ప్లాంట్లన్నింటా ఇదే తీరుగా బీటీ మిశ్రమం తయారవుతోంది. ఆర్ అండ్ బీతోపాటు గతంలో పంచాయతీరాజ్ రోడ్లన్నింటా ఇదే నిబంధన అమల్లో ఉంది. రూ.2,500 ఖర్చయ్యే డస్ట్ బదులుగా రూ.30 వేల విలువయ్యే సిమెంట్ ధరతో అదనపు భారం పెరిగిపోయింది. కానీ సిమెంట్ మిశ్రమంతో ఈ ఖర్చు ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.27,500 చొప్పున పెరిగిపోతుంది. రాష్ట్రంలో మండలాలవారీగా అనుమతించిన ప్యాకేజీ పనులను లెక్కగగితే... దాదాపు రూ.33 కోట్ల అంచనా వ్యయం పెరిగిపోతోంది. అంతమేరకు సర్కారుకు కుచ్చుటోపీ పెట్టినట్లేనని స్పష్టమవుతోంది. నాణ్యత అంతంతే... బీటీలో స్టోన్ డస్ట్‌ను కలిపినా సిమెంట్ కలిపినా నాణ్యత విషయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన రోడ్డు పనుల్లో సిమెంట్ ఉపయోగించిన దాఖలాలు లేవు. మరోవైపు పనులు జరిగాక బీటీ మిశ్రమంలో సిమెంట్ కలిపారా, డస్ట్ కలిపారా అనేది గుర్తించటం అసాధ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అనుచిత నిబంధనలతో అంచనా వ్యయాన్ని పెంచినందుకు ప్రతి కాంట్రాక్టరు నుంచి అంతమేరకు కమీషన్లు పెంచుకోవాలనేది ఇంజనీరింగ్ అధికారుల ఎత్తుగడగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక అధికారి కింది స్థాయి ఉద్యోగుల నుంచి డివిజన్‌కు రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు గుప్పుమంటోంది. వీటితోపాటు సీఆర్ఆర్ నిధులతో మంజూరైన పనులకు సైతం డివి జన్లవారీగా వసూళ్ల పర్వం జోరందుకుంది. -
రా..రమ్మని!
బీపీఎస్ కోసం ఇంటిబాట కరపత్రాలు, సదస్సుల ద్వారా ప్రచారం బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు రోజువారీ టార్గెట్లు కార్పొరేషన్ ఖజానా నింపేందుకు కసరత్తు విజయవాడ సెంట్రల్ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన కార్పొరేషన్ ఖజానా నింపుకొనేందుకు భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు 2007 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. గూగుల్ మ్యాప్, ఇంటిపన్ను రసీదులను పరిగణనలోకి తీసుకుని బీపీఎస్‌ను వర్తింపజేయాలన్న ఆలోచనకు వచ్చారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం నిబంధనలు గందరగోళంగా మారడంతో గృహ నిర్మాణదారుల నుంచి స్పందన కరువైంది. గడిచిన పది రోజుల్లో కేవలం 30 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో వచ్చాయి. మరో నెలా ఇరవై రోజుల్లో గడువు పూర్తికానుంది. పెద్దసంఖ్యలో బీపీఎస్ దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ మేర కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళదాం టౌన్ ప్లానింగ్ విభాగం ఏడాదికి సగటున 2,500 ఇళ్ల ప్లాన్లు మంజూరుచేస్తోంది. 2007లో బీపీఎస్‌కు 15,826 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,287 క్లియర్ చేశారు. కోర్టు కేసులు, గడువు లోపు దరఖాస్తులు అందకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. 2007 తర్వాత మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కాలంలో సుమారు 18,500 వరకు ప్లాన్లు మంజూరు చేయగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి భవన నిర్మాణాలను పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ఇంటూ మార్క్ వేస్తారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ఇంటూ మార్క్‌ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు. ఇలా చేయడం ద్వారా బీపీఎస్‌కు సంబంధించి గృహ నిర్మాణదారులను రమ్మని ఆహ్వానించినట్లవుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నారు. రోజుకు వంద టార్గెట్ అప్పుల ఊబిలో ఉన్న నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. 1985 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన భవనాలకు మాత్రమే బీపీఎస్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్ ఆధారంగానే గృహనిర్మాణాల్లో అక్రమాలను గుర్తించాలని నిర్ణయించారు. పన్ను రసీదును పరిగణనలోకి తీసుకోవాలని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇక వారు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి రోజుకు ఒక్కో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కనీసం వందకు తగ్గకుండా దరఖాస్తులు స్వీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నగరంలోని 14 మీ-సేవ కేంద్రాలు, మూడు సర్కిల్ కార్యాలయాలతోపాటు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. సంబంధిత పత్రాలతో గృహ నిర్మాణదారులు ఈ కేంద్రాలకు వచ్చినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు బాధ్యతను ప్రత్యేక సిబ్బందే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ముమ్మర ప్రచారం బీపీఎస్‌పై ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు సిటీ ప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. కరపత్రాలు, డివిజన్లలో సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 16 వేల దరఖాస్తులు అందాలన్నది లక్ష్యమన్నారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో ఏం చేయాలనేదానిపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.