మద్యం వ్యాపారం.. నిబంధనలు కఠినం
∙ దుకాణం వద్ద సిట్టింగ్ గది తప్పనిసరి
∙ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదని షరతు
∙ గగ్గోలు పెడుతున్న వ్యాపారులు
భీమవరం: మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం మద్యం దుకాణాలపై నిబంధ నలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే దుకాణాల వద్ద సిట్టింగ్ గదిని తప్పనిసరి చేయగా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదనే షరతు విధించింది. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నా రు. వాటర్, గ్లాసులు లేకుండా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటుచేయడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 474 మద్యం షాపులు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో దుకాణానికి రూ.11.25 లక్షల చొప్పున ఫీజు రూపంలో వసూలు చేసింది. సుప్రీంకోర్టు నిబం ధనలు, జనా వాసాల మధ్య దుకాణాల ఏర్పాటుపై ఆందోళనల నేపథ్యంలో జిల్లాలో సుమారు 90 షాపుల వరకూ ఇ ప్పటికీ ఏర్పాటుకాలేదు. భీమవరంలో 20 దుకాణాలు, ఆరు బార్‌లకుగాను 15 షాపులు మాత్రమే ఏర్పాటుచేశారు.
సిట్టింగ్ రూమ్‌కు రూ.5 లక్షలు
గతంలో మద్యం దుకాణాల వద్ద వ్యాపారులు తమ ఇష్ట్రపకారం రూ.లక్ష చెల్లించి సిట్టింగ్ రూమ్ ఏర్పాటుచేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సిట్టింగ్ రూమ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలని నిబంధన విధించింది. అ యితే సిటింగ్ రూమ్‌ల వద్ద వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించకూడదనే షరతు పెట్టింది. దీంతో వ్యాపారాలు దెబ్బతింటాయని దుకాణదారులు ఆవే దన చెందుతున్నారు.
రోజుకు సుమారు లక్ష ప్యాకెట్లు
మద్యం షాపుల వద్ద రోజుకు సుమారు లక్ష వరకు వాటర్ ప్యాకెట్లు వినియోగించేవారు. ప్రస్తుతం వీటిపై నిషేధం విధించడంతో వాటర్ ప్లాంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైతే సొమ్ములు వసూలు చేయాలని, అంతేగాని వాటర్ ప్యాకెట్లు, గ్లాసులపై నిషేధం విధించడం సరికాదని వ్యాపారులు అంటున్నారు.