పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం
హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది
తాండూరు: పోలీసు శాఖలో ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం, నియామకాలు పెద్దఎత్తున చేపట్టనున్నట్లు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. ఆదివారం ఆయన ఇద్దకు కుమారులతో కలసి సైకిల్‌పై హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరుకు వచ్చారు. ఆయన 120కి.మీ. సైకిల్‌పై ప్రయాణించారు. ఈ సందర్భంగా తాండూరులో విలేకరులతో మాట్లాడారు. త్వరలో విడుదల కానున్న నోటికేషన్‌లో కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ పోస్టుల వరకు నియామకాల్లో మూడేళ్లు వయోపరిమితికి మినహాయింపు ఉంటుం దన్నారు. పోలీసులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక బాధ్యతలు నిర్వర్తించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ట్రామాకేర్ సెంటర్ పనుల పరిశీలించారు. వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడి ఇక్కడి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.