
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు వేగవంతం కానున్నాయి. తెలంగాణ కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సచివాలయం కూల్చివేతకు శుక్రవారం అనుమతినిచ్చింది. కోర్టు అనుమతి నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం తిరిగి శనివారం(జూలై 18) నుంచి ప్రారంభిచనుంది.
కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేసిన రెండ్రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే సచివాలయం ఏ, బీ, సీ, డీ, జీ బ్లాక్‌ల పవర్ రూంలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన భవనాలను కూడా కూల్చివేసిన తర్వాతే వ్యర్థాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment