telangana secretariat building demolish
-
సచివాలయ కూల్చివేత పనులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు వేగవంతం కానున్నాయి. తెలంగాణ కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సచివాలయం కూల్చివేతకు శుక్రవారం అనుమతినిచ్చింది. కోర్టు అనుమతి నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం తిరిగి శనివారం(జూలై 18) నుంచి ప్రారంభిచనుంది. కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేసిన రెండ్రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే సచివాలయం ఏ, బీ, సీ, డీ, జీ బ్లాక్‌ల పవర్ రూంలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన భవనాలను కూడా కూల్చివేసిన తర్వాతే వ్యర్థాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కూల్చుడంటే కొత్తగా కట్టుడు కాదు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల్ని కూల్చడమంటే కొత్త నిర్మాణాలను ప్రారంభించడం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. శిథిలావస్థలోని భవనాల్ని కూల్చి చదును చేయడమే చేస్తున్నామని, కొత్త నిర్మాణాలు పునాది తవ్వకాలతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మాణాల కోసం భూమిని చదును చేయడానికి పర్యావరణ అనుమతులు అవసరమో కాదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త నిర్మాణాలకు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమ తులు పొందలేదంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఇది రహస్య పత్రం: ఏజీ సచివాలయ భవనాల్ని కూల్చేయాలని మంత్రివర్గం గత నెల 30 ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్లో అడ్వొ కేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ధర్మాసనానికి అందజేశారు. ఇది రహస్య పత్రమని చె ప్పారు. దీంతో ఆ ప్రతిని పరిశీలించిన ధర్మాసనం సీల్డ్ కవర్‌ను భద్రంగా ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. నిర్మాణాలు కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేయాలంటే ప్రభుత్వం పర్యావరణ ఇతర శాఖల అనుమతులు పొందలేదని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ చెప్పారు. దీనిపై స్పందించిన ఏజీ కూల్చి వేతలకు మాత్రమే అనుమతి తీసుకున్నామని, నిర్మా ణాలకు విడిగా అను మ తులు తీసుకుంటామని చెప్పారు. పురాతన భవనాలు కూల్చేందుకు అను మతి తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత నిర్మాణాలకు కూడా అ నుమతులు తీసు కున్నామని చెబితే ప్ర భుత్వం ఏం చేస్తుందని ధర్మాసనం ప్రశ్నిం చింది. చట్ట నిబంధనలను నీరుగార్చకూ డదని, కూల్చివేతలు నిర్మాణాల కోసమేననే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాలు ప్రస్తావిం చిన సుప్రీం ఉత్తర్వుల ప్రతుల కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది. మసీదును తిరిగి నిర్మిస్తాం.. సచివాలయ ప్రాంగణంలోని కూల్చేసిన మసీదును తిరిగి సౌకర్యాలతో నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సచివాలయ భవనాల కూల్చివేత చర్యల్లో భాగంగా 6,477 చదరపు గజాల్లోని మసీదును కూల్చేయడాన్ని తప్పుబడుతూ జాకీర్ హుస్సేన్ రిట్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి... ఈ హామీని అఫిడవిట్ రూపంలో తెలియ జేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
సచివాలయ కూల్చివేతపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే కొనసాగుతూనే ఉంది. సచివాలయం కూల్చివేత అంశంలో అడిషనల్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు పిటిషనర్‌ను కోరింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భవనాల కూల్చివేతకు రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని పలు తీర్పులు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ రిప్లై దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం-2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రిజర్వ్‌మెంట్స్ తీసుకోవాలని పిటిషనర్ తెలుపగా, లీగల్ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పిటిషనర్‌ను కోరింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. (15 వరకు సచివాలయ కూల్చివేత ఆపండి: హైకోర్టు) భవనాల కూల్చివేతకు కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొనగా, ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని ఈ సందర్భంగా ఏజీ పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని, నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ, స్థానిక అధికారులు, పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. కాగా సోలిసిటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. (యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?) -
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
-
‘గుడి కూలింది.. నీవు కూలతావు’
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఎందుకు కూలుస్తున్నాడో అర్థం కావడం లేదు.. నల్లపోచమ్మ గుడి కూల్చినందుకు ప్రజలు ఈ ప్రభుత్వానికి దినం పెడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి కూలింది అంటే నీవు కూలతావు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో ఇతర పార్టీ నాయకలు ఐదు రోజులు కనిపిస్తే.. వారం రోజులు కనిపించడం లేదు. కానీ బీజేపీ నేతలు.. కార్యకర్తలు మాత్రమే నిరంతరం పేదలకు సేవ చేస్తున్నారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు సీఎం కేసీఆర్. దేవుడు ఇచ్చిన దానికి పూజారి చెప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. సొమ్మొకడిది సొకొకడిది అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డెడికేటెడ్ ఆసుపత్రులు సరిగా లేవు. బెడ్స్ ఏర్పాటు చేయలేదు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. తుపాకీ పేల్చినట్టు మాట్లాడి పోయే ముఖ్యమంత్రితో తెలంగాణ అభివృద్ధి జరగదు. ఎందుకు మాయమైపోతున్నాడని అడిగితే అరెస్ట్‌లు చేస్తున్నారు. కానీ బీజేపీ మిమ్మల్ని ఎదిరించి.. ప్రశ్నిస్తుంది. టీఆర్ఎస్ లాగా కమీషన్.. కాంగ్రెస్‌లాగా కాంట్రాక్టుల పార్టీ కాదు బీజేపీ. ప్రభుత్వం చేస్తున్నది అరెస్ట్‌లు కాదు కిడ్నాప్‌లు. టీఆర్ఎస్ పార్టీ దిగిపోయే రోజు దగ్గర పడింది. మోదీ కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అన్ని స్కాంలే.. మా ప్రభుత్వం వచ్చాక అవినీతి.. స్కాంలకు ఆస్కారం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య.. 370 ఆర్టికల్.. త్రిపుల్ తలాక్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. తెలంగాణకు 60ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చేయలేని సాయం 6 ఏళ్ళలో మోదీ సర్కార్ చేసింది’ అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశ సగటు కంటే అదనంగా తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేసింది కేంద్రం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తాడు. గతంలో పటేల్ ముందు నిజాం వంగి దండాలు పెట్టి ఆ తరువాత రజాకార్లను ఎగదోసినట్టు వ్యవహరిస్తున్నాడు కేసీఆర్. విద్యుత్ గ్రిడ్లను అనుసంధానం చేసి రాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇస్తోంది కేంద్రం. విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసింది. కేసీఆర్ మాయల మరాఠిలా వ్యవహరిస్తున్నాడు. మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉంది. కాంగ్రెస్ డీఎన్ఏ ఇప్పుడు టీఆర్ఎస్కు పట్టింది. కరోనా తెలంగాణ కాదు బంగారు తెలంగాణ కావాలంటే అది బీజేపీతోనే సాధ్యం’ అని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన
-
భవనాల కూల్చివేత: హైకోర్టు ఆదేశాలు
-
ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు. ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై తాను చాలా బాధపడుతున్నాను అన్నారు కేసీఆర్. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తమ అభిమతం కాదన్నారు. ఆలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానని, వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
‘అప్పటిదాకా కూల్చివేత పనులు ఆపండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొందని ఆదేశాలు జారీ చేసింది. (సచివాలయం కూల్చివేత) కాగా కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని కోర్టుకు విన్నవించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పేర్కొన్నారు. -
సచివాలయ కూల్చివేతను నిలిపేయాలని ...
-
కూల్చివేత ఆపాలంటూ పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ మేరకు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. భవనాల కూల్చివేత వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని, 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. దీన్ని అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. కాగా సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. కూల్చివేత పనులు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. (సచివాలయం కూల్చివేత) -
కాలగర్భంలో పాత సచివాలయం
-
కేసీఆర్ తప్పు చేస్తే.. శిక్ష ప్రజలకా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలు అవసరం అనుకుంటే ఓ కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీ హాల్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. టీఆర్ఎస్కు అధికారం పరిమితం కాదని, కొత్త సచివాలయం కట్టాలనుకుంటే దానిపై కమిటీ వేసి పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చిన కేసీఆర్.. వాటిని పక్కకు పెట్టి సచివాలయం కడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల సచివాలయ సందర్శనపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోమని, సీఎం కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు కట్టేది కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదన్నారు. కేసీఆర్ చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. (చదవండి : కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?) కాగజ్‌నగర్‌లో మహిళా అటవీ అధికారిణిపై దాడిని సమర్థించడంలేదని, కానీ ఆ పరిస్థితిని తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. కాగజ్‌నగర్ ఘటన తిరుగుబాటుకు సంకేతమన్నారు. గిరిజనుల భూములను అన్యాయంగా గుంటుకున్నందుకే ప్రజలు తిరగబడ్డారన్నారు. కాగజ్‌నగర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని వేస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్యతో కూడిన కమిటి కాకజ్‌నగర్ వెళ్లి విచారిస్తుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో చాలా మంది నేతలతో చర్చించానని, వారంత త్వరలో తాను ఏర్పాటు చేయబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతారని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. -
‘మూఢనమ్మకాల పిచ్చితో కేసీఆర్ ఆ పని చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢనమ్మకాల పిచ్చితో సచివాలయాన్ని కూల్చివేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఆధునిక పరిజ్ఞానంతోనే నిర్మించారని, 100 ఏళ్లు కోసం కట్టిన సచివాలయంలో ఏ భవనం కూడా 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉపయోగించలేదన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూలగొడుతున్నారని విమర్శించారు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానన్న కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదన్నారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అమరవీరుల స్మారకానికి పునాదిరాయి పడలేదు కానీ, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన విధ్యాభవనాలు నిర్మించాలన్నారు. సచివాలయాన్ని కూల్చడంపై న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం వేశానన్నారు. సచివాలయ భవనాల కూల్చివేతను కాంగ్రెస్ పార్టీ అట్టుకుంటుందన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు భవనాల కూల్చివేతను అడ్డగించేందుకు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. -
మీడియాపై హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి బుధవారం మీడియాపై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. సచివాలయ కూల్చివేత కేసులో హైకోర్టు స్టే ఇచ్చినట్లు కొన్ని పత్రికలు (సాక్షి కాదు) ప్రచురించాయని ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం దష్టికి తీసుకొచ్చారు. స్టే ఇచ్చినట్లు పతాక శీర్షికల్లో ప్రచురించాయంటూ కొన్ని పత్రికల పేర్లను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, తాము ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కూల్చబోమని మీరు (అడ్వొకేట్ జనరల్) ఇచ్చిన హామీనే రికార్డ్ చేసి, కౌంటర్ దాఖలు చేయాలని మాత్రమే ఆదేశించామని తెలిపింది. ఇందులో తాము ఇచ్చిన ఉత్తర్వులేమీ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తుండటంపై కూడా ధర్మాసనం ఒకింత అసంతప్తిని వ్యక్తం చేసింది. స్టే ఇచ్చినట్లు వచ్చిన కథనాలకు సంబంధించి రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని అడ్వొకేట్ జనరల్‌కు ధర్మాసనం తెలిపింది.