సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల్ని కూల్చడమంటే కొత్త నిర్మాణాలను ప్రారంభించడం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. శిథిలావస్థలోని భవనాల్ని కూల్చి చదును చేయడమే చేస్తున్నామని, కొత్త నిర్మాణాలు పునాది తవ్వకాలతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మాణాల కోసం భూమిని చదును చేయడానికి పర్యావరణ అనుమతులు అవసరమో కాదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త నిర్మాణాలకు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమ తులు పొందలేదంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఇది రహస్య పత్రం: ఏజీ
సచివాలయ భవనాల్ని కూల్చేయాలని మంత్రివర్గం గత నెల 30 ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్‌లో అడ్వొ కేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ధర్మాసనానికి అందజేశారు. ఇది రహస్య పత్రమని చె ప్పారు. దీంతో ఆ ప్రతిని పరిశీలించిన ధర్మాసనం సీల్డ్ కవర్‌ను భద్రంగా ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. నిర్మాణాలు కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేయాలంటే ప్రభుత్వం పర్యావరణ ఇతర శాఖల అనుమతులు పొందలేదని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ చెప్పారు. దీనిపై స్పందించిన ఏజీ కూల్చి వేతలకు మాత్రమే అనుమతి తీసుకున్నామని, నిర్మా ణాలకు విడిగా అను మ తులు తీసుకుంటామని చెప్పారు. పురాతన భవనాలు కూల్చేందుకు అను మతి తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత నిర్మాణాలకు కూడా అ నుమతులు తీసు కున్నామని చెబితే ప్ర భుత్వం ఏం చేస్తుందని ధర్మాసనం ప్రశ్నిం చింది. చట్ట నిబంధనలను నీరుగార్చకూ డదని, కూల్చివేతలు నిర్మాణాల కోసమేననే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాలు ప్రస్తావిం చిన సుప్రీం ఉత్తర్వుల ప్రతుల కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది.
మసీదును తిరిగి నిర్మిస్తాం..
సచివాలయ ప్రాంగణంలోని కూల్చేసిన మసీదును తిరిగి సౌకర్యాలతో నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సచివాలయ భవనాల కూల్చివేత చర్యల్లో భాగంగా 6,477 చదరపు గజాల్లోని మసీదును కూల్చేయడాన్ని తప్పుబడుతూ జాకీర్ హుస్సేన్ రిట్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి... ఈ హామీని అఫిడవిట్ రూపంలో తెలియ జేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కూల్చుడంటే కొత్తగా కట్టుడు కాదు
Published Thu, Jul 16 2020 5:16 AM | Last Updated on Thu, Jul 16 2020 1:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment