సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొందని ఆదేశాలు జారీ చేసింది. (సచివాలయం కూల్చివేత)
కాగా కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని కోర్టుకు విన్నవించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment