వీణవంక : ఇందిరమ్మ ఇంటి దొంగల భరతం పట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మంత్రి వర్గం ఇటీవల తీర్మానించినట్లు తెలిసింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. మరో దఫా సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో రెండు రోజుల క్రితం సీఐడీ డీఎస్పీ క్రిష్ణ ఆధ్వర్యంలో వీణవంక మండలం రెడ్డిపల్లి, కొండపాక, మంథని నియోజకవర్గంలోని రుద్రారం, పెగడపల్లి గ్రామాల్లో మూడో విడత సర్వే చేపట్టారు. ఇప్పటికే రెండు విడతలుగా విచారణ జరిపిన సీఐడీ బృందం.. నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందించింది.
మంథనిలోని రుద్రారం, వీణవంక మండలంలోని రెడ్డిపల్లిలో భారీ అక్రమాలు జరిగాయని సీఐడీ బృందం నిగ్గుతేల్చింది. మంథని, వీణవంక మండలాల్లో కలిపి 2634ఇళ్లు మంజూరు కాగా ఇందులో 520మంది అక్రమాల పాల్పడ్డట్లు సీఐడీ గుర్తించినట్లు సమాచారం. 2014 ఆగస్టు14న జిల్లాలో సీఐడీ విచారణ ప్రారంభించింది. కరీంనగర్ డివిజన్‌లోనే రెడ్డిపల్లి అవినీతిలో టాప్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నాలుగు గ్రామాల్లో 2634ఇళ్లు ఉండగా, రెడ్డిపల్లిలో 556కు 17, కొండపాకలో 334కు 21, రుద్రారంలో 1344కు 147, పెగడపల్లిలో 400కు 80ఇళ్లలో అక్రమాలు జరిగాయని మొదటి విడత తనిఖీలో వెలుగులోకి వచ్చాయి. రెండో విడతలో భాగంగా రెడ్డిపల్లిలో ఒకే ఇంటిపై 42మంది బిల్లులు పొందగా, 10మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16మంది మైనర్లు, పాత ఇంటికే బిల్లులు పొందిన వారు 23మంది ఉన్నట్లు సీఐడీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఇక్కడ వీవోలే సగానికి పైగా అక్రమాలకు పాల్పడ్డట్లు సమాచారం. కొండపాకలో సగానికి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించుకున్నట్లు తనిఖీలో వెల్లడైంది.
మచ్చుకు కొన్ని..
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్భాక సువర్ణ, ఎల్భాక వజ్రమ్మకు 2004లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
వీరు స్వయంగా అత్తాకోడళ్లు. వీరు ఇల్లు నిర్మించి రూ.50వేల బిల్లు తీసుకున్నారు. ఇదే ఇంటిపై వజ్రమ్మ ఫేజ్-1కింద మళ్లీ ఇల్లు మంజూరు చేసుకొంది. మరో రూ.25వేలు అధికారులు ఇచ్చారు. అంటే ఒకే ఇంటిపై మూడు బిల్లులు(రూ.75వేలు)పొందారు.అయితే అసలు విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తించారు. అసలు వీళ్లు 2003లోనే ఇల్లు కట్టుకున్నట్లు అధికారుల తనిఖీలో బయట పడింది. పాత ఇంటికే బిల్లులు పొందడమే కాగా కమర్షియల్‌గా రూపుదిద్ది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు లీజుకు ఇవ్వడంపై అధికారులే నివ్వరపోయారు.
మంథనిలోని రుద్రారంలో 68ఇళ్లు దళారులు అమ్మకున్నట్లు తేలింది. లబ్ధిదారులకు తెలియకుండా సొమ్ము కాజేశారు.
రెడ్డిపల్లికి చెందిన రమకు 2006లో ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.
ఇదే గ్రామానికి చెందిన పోతుల మాణిక్యం ఇద్దరు కూతుళ్లకు రెండు ఇళ్లు మంజూరయ్యాయి. వీరికి రూ.54వేలు అందినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ రూ.9వేలు మాత్రమే వీవోలు ఇచ్చినట్లు సీఐడీకి మొరపెట్టుకోవడంతో రూ.45వేలు అక్రమాలు జరిగాయని గుర్తించారు.
కొండపాకకు చెందిన కూర నరసింహారెడ్డి ఇల్లు నిర్మించుకోగా రూ.28వేలు ముట్టినట్లు గా రికార్డుల్లో ఉంది. కానీ రూ.5500తోపా టు ఎనిమిది సిమెంటు బస్తాలు అందినట్లు అతడి కుమారుడు సతీష్‌రెడ్డి తెలిపారు.
అక్రమార్కుల్లో వణుకు..
మంథని, హుజురాబాద్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై గురువారం గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో నాలుగు నెలలుగా స్తబ్ధుగా ఉన్న గ్రామాల్లో మళ్లీ సీఐ డీ తనిఖీలు అలజడి రేపారుు. ముఖ్యంగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.
మళ్లీ అలజడి
Published Sat, Mar 14 2015 3:09 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement