బలిపీఠంపై బక్క రైతు
- పంటలు పండక.. అప్పులు తీరక..దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు
- నెల రోజుల్లో జిల్లాలో 15 వుంది ఆత్మహత్య
నర్సంపేట : తొలకరి వర్షం కురవగానే పుడమితల్లి వుట్టివాసనతో పులకరించిన రైతన్నలు నేడు పంటలు చేతికందే పరిస్థితి లేకపోవంతో చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. జిల్లాలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్-16 వరకు 15 వుంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధాన నీటి వనరులు ఉన్నా వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌లో వరి పంట సాగు కాలేదు.
పత్తి, మొక్కజొన్న, మిర్చి సాగు చేసినా నీరందకపోవడతోరైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్‌లో 8 వుంది ఆత్మహత్య చేసుకోగా ఈనెల 15 వరకు ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ముగ్గురు ఉరి వేసుకుని చనిపోగా 12 వుంది పురుగుల వుందు తాగి తనువు చాలిం చారు. ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సం పేటలోనూ పంటలు పండే పరిస్థితి లేక ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
421 జీఓ ఏం చెబుతోంది..!
వర్షాలు కురవక కరువు నేపథ్యంలో రైతులకు దిగుబడి రాక అప్పుల బాధ భరించలేక బలవన్మరణం చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయూంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 421 జీఓను విడుదల చేశారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1,50,000 చెల్లించేలా నిర్ణయుం తీసుకున్నారు. ఈ జీవోను ఆ తర్వాతి ప్రభుత్వాలు తుంగలో తొక్కడంతో మృతిచెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు.
పరిహారం అందించాల్సిందిలా..
గ్రావూల్లో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే తహసీల్దార్, వుండల వ్యవసాయు అధికారి, గ్రావు రెవెన్యూ అధికారి మొదటి దశలో ప్రాథమిక విచారణ చేస్తారు. అనంతరం డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ, డివిజనల్ పోలీస్ అధికారి(డీఎస్పీ), వ్యవసాయు శాఖ సహాయు సంచాలకులు(ఏడీఏ) రైతు ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అది పూర్తయిన తర్వాత కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత బాధిత రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తారు.
ఇంటి పెద్ద ఆత్మహత్యతో డేరాలో దుర్భర జీవనం
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు నేదురు యాకలక్ష్మి. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల తిమ్మంపేట గ్రామం. వీరిది సామాన్య రైతు కుటుంబం. ఎకరం వ్యవసాయ భూమి ఉండగా సేద్యం చేసుకుంటూనే కుమారస్వామి, యాకలక్ష్మి దంపతులు కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తుండేవారు. వారికి కూతురు అనిత, కుమారుడు అనిల్ ఉన్నారు. రెండేళ్ల క్రితం కూతురు అనితకు పెళ్లి చేశారు. అనిల్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు.
కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ కలిపి రూ.3 లక్షల వరకు తీర్చాల్సి ఉంది. అప్పు తీరాలంటే వ్యవసాయంతో కష్టమని ఈ ఏడాది కుమారస్వామి ఇదే గ్రామంలో ఓ ఆసామికి ఏడాదికి రూ.80 వేలకు పాలేరుగా చేరాడు. అప్పుల బాధతోనే ఉన్న కుమారస్వామి సెప్టెంబర్ 26న గ్రామంలో గుండం చెరువు తూముకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి కనీసం ఉండటానికి ఇల్లు లేక నల్ల టార్పాలిన్‌ను గుడారంలా వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని మృతుడి భార్య వేడుకుంటోంది.