మహనీయుడు అంబేద్కర్ | Ambedkar Jayanti celebrations at karimnagar district | Sakshi
Sakshi News home page

మహనీయుడు అంబేద్కర్

Published Tue, Apr 15 2014 2:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

మహనీయుడు అంబేద్కర్ - Sakshi

మహనీయుడు అంబేద్కర్

 కరీంనగర్ , న్యూస్‌లైన్: దేశానికి రాజ్యాంగాన్ని అందించి దిశా నిర్దేశం చూపిన డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ మహనీయుడని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కొనియాడారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఎస్పీ శివకుమార్, జేసీ సర్పరాజ్ అహ్మద్, ఏజేసీ నంబయ్య తదితరులు కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే అనేక అవమానాలు ఎదుర్కొన్న అంబేద్కర్, దేశ పరిస్థితిని ఆకళింపు చేసుకొని రాజ్యాంగం రూపొందించారన్నారు.



అందరికీ సమాన అవకాశాలు కలిగేలా రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు బి.వినోద్‌కుమార్, ఎం.రాజిరెడ్డి, గంగుల కమలాకర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, బండి సంజయ్, అక్కనపల్లి కుమార్, జేఎసీ నాయకులు బి.వెంకటమల్లయ్య, నల్లాల కనుకరాజు,  దళిత సంఘాల నాయకులు ఎం.రాజవీరు, దామెర సత్యం, కల్లెపల్లి శంకర్, లింగంపల్లి సత్యనారాయణ, సుంకరి సంపత్, మేదరి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, సుంకె యశోద, నిర్మల, మేడి మహేశ్, మ్యాధరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement