
శంషాబాద్: హైదరాబాద్ నుంచి పలువురు అమెరికన్లు ప్రత్యేక విమానంలో వారి దేశానికి బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో వీరిని అమెరికాకు పంపారు. ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానం ఏఐ1616 గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అమెరికన్లకు శానిటైజేషన్ చేసిన టెర్మినల్ ద్వారా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 101 మంది ప్రయాణికులు 3.52 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరారు. అక్కడి నుంచి డెల్టా ఎయిర్‌లైన్స్ ద్వారా మరికొందరు ప్రయాణికులతో కూడిన విమానం అమెరికా బయలుదేరింది. లాక్‌డౌన్ తర్వాత, అమెరికా, యూకే తదితర దేశాలకు సంబంధించి మొత్తం 12 ప్రత్యేక విమానాలు ఇక్కడి నుంచి వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment