
విద్యుత్‌పై ఏపీ వాదనలు సరికాదు
నల్లగొండ : రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విద్యుత్ విషయం లో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలు సరికాదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వాదనలు, ప్రతివాదనల తో ఇరు ప్రాంత ప్రజల మధ్య విధ్వేషాలు చెలరేగుతాయన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సున్నితమైన అంశాల్లో రెండు రాష్ట్రా ల సీఎంలు సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిం చుకోవాలని సూచించారు. పోల వరం, హైదరాబాద్ శాంతిభద్రతల అంశాలపై అఖిలపక్షాలను సమావేశ పరచి పరిష్కా రమా ర్గం కనుగొనాలన్నారు. పోలవరం ముంపులోని ఏడు మండలాల ప్రజల ఆవేదనను ఆంధ్రా ప్రభుత్వం మన్నించాలన్నారు.
మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి
సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రసార మాద్యమాలు నిర్వహిస్తున్న చర్చల్లో నెగిటివ్ కోణం ఎక్కువగా ఉంటోందని, అది మంచిది కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ మీడియా ద్వంద్వ వైఖరి చూపిందన్నారు. కొన్ని చానల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం అసహించుకునే రీతిలో ప్రచార కార్యక్రమాలు చేయడం బాధాకరమన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు మునాస వెంకన్న పాల్గొన్నారు.