- నైజీరియన్ సహా ముగ్గురి అరెస్ట్
- కెల్విన్, సంగీతతోనూ సంబంధాలు
- లిస్ట్ లో సినీ సెలబ్రిటీలు!
హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ దందా వెలుగు చూసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 10 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆరుగురు కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
అరెస్టయిన వారిలో ఓ విదేశీయుడు కూడా ఉండగా, వారి వద్ద నుంచి సుమారు 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గోవా, తెలంగాణలోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న గ్యాబ్రియెల్, నవ్యంత్, అకింత్ పాండ్యా, గణత్‌కుమార్ లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరికి డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తోపాటు విజయవాడ డ్రగ్స్ డాన్ సంగీత ముఠాతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి సుమారు 50 మంది మహిళలు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా అందించినట్లు తేలిందని కమిషనర్ తెలిపారు. బంజారాహిల్స్, గచ్చిబౌలిలోని పలు పబ్‌లకు చేరవేస్తున్న వీళ్లు, ఆగష్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీనే ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పరీక్షల నిమిత్తం వారి వద్ద నుంచి రక్తం,గోళ్లు, వెంట్రుకలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు మహేష్ భగవత్ వెల్లడించారు.