- ఢిల్లీలో నేడు బీడీ యాజమాన్యాల సమావేశం
కోరుట్ల: బీడీ పరిశ్రమను సమ్మెబాట పట్టించిన పుర్రె గుర్తు మరోమారు కార్మికులను కలవరపరుస్తోంది. బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు కేంద్ర కార్మిక సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటుండడాన్ని బీడీ కంపెనీల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బీడీకట్టలపై ఉన్న పుర్రె గుర్తు, అవయవాల ముద్రణతో అమ్మకాలు పడిపోయాయని, మళ్లీ గుర్తు పెద్దగా చేసి మద్రించాలన్న యోచనతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ క్రమంలో బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు నిరసనగా కంపెనీల మూసివేతకు యజమాన్యాలు యోచిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీల యాజమాన్యాలు గురువారం ఢిల్లీలో సమావేశమవుతున్నాయి.