తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో స్థానికత ఆధారంగా 1100 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పంపింది.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కమలనాథన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఉద్యోగుల రిలీవ్ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది.