నిజామాబాద్ అర్బన్: నగరంలో అక్రమ కట్టడాలే కాదు...అపార్టుమెంట్లలోనూ అనధికారికంగా నివాసాలూ కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ని ర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత వారు ప్రతి ప్లా టుకూ ఇంటి నంబరు కేటారుుస్తారు. ఈ విషయూన్ని ఇటు అధికారులు,అటు యజమానులు పట్టించుకోవడం లేదు. కేవలం ప్లాట్లకు ప్రరుువేటు నంబర్లు వేసి సరిపెడుతున్నారు. దీంతో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయూనికీ గండి పడుతోంది. కొందరు అపార్టుమెంట్ల యజమా నులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆస్తిపన్నును దర్జాగా ఎగవేస్తున్నారు. ఇపుడు ఆ పన్నులను వసూలు చేసేందుకు బల్దియూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 131 వరకు అపార్టుమెంట్లు ఉన్నాయి. ఒక్కో అపార్టుమెంటులో కనీసం 30 వరకు ప్లాట్లు ఉన్నాయి. నిబంధ నల ప్రకారం వీటి నిర్మాణాలకు ముందుగానే యజమానులు బల్దియూ అనుమతి తీసుకోవాలి. అధికారులు ఇంటి నంబర్లు కేటారుుంచాలి. కానీ, ఎక్కడా ఇది అమలు కావడం లేదు. ఇంటి నంబర్ ప్రకారం ఏడాదికి రెండు సార్లు కార్పొరేషన్‌కు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 ప్లాట్లకు ఇంటి నంబర్లు ఉంటే వాటన్నింటికీ పన్ను చెల్లించా ల్సి ఉంటుంది. చదరపు గజాలను బట్టి పన్నును నిర్ణయిస్తారు. ఒక్కో నివాసానికి సుమారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఏటా రెండు సార్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
యజమానులు మాత్రం ఒకటో, రెండో ఇంటి నంబర్లు తీసుకుని మిగతావాటి ఆస్తి పన్నును ఎగవేస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు బల్దియూ తన ఆదాయూన్ని కోల్పోతోంది. అపార్టమెంట్లలో ఎవరు కూడా ఇంటి నంబర్‌ను తీసుకోవడం లేదు. ప్లాట్ నంబర్ మాత్రమే వేస్తున్నారు. ఇందుకు అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కార్పొరేషన్ నిధులతోనే అధికారులు అభివృద్ధి పనులు చేస్తున్నారు. పన్నుల విషయం లో మాత్రం దృష్టి సారించడం లేదు. ఖలీల్‌వాడీ ప్రాంతంలో భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందులో సుమారు 70 శాతం భవనాలు పన్ను చెల్లించకుం డా నే కొనసాగుతున్నాయి.
సీఎంకు నివేదిక
నగరంలోని అపార్టుమెంట్లలో పన్నుల చెల్లింపులకు సంబంధించిన లెక్కింపు వ్యవహారం ఇష్టారీతిన సాగిందని కార్పొరేషన్ అధికారులు గత శనివారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో నివేదికను సమర్పించారు. నిర్మాణాలు సక్రమంగా లేవని, అపార్టుమెంట్లు పన్నులు ఎగవేస్తున్నాయని పేర్కొన్నారు.
దీనిపై సీఎం కూడా సీరియస్‌గా స్పందించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మార్చికల్లా అన్ని అపార్టుమెంట్లలో పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కమిషనర్ వెంకటేశ్వర్లు బిల్ కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. పన్నులు చెల్లించని నివాసాలను గుర్తించాలని ఆదేశించారు. అందు లో భాగంగానే పూర్తి స్థాయిలో మళ్లీ నోటీసులు ఇచ్చి మార్చి చివరి వరకు పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేస్తామని కమిషనర్ తెలిపారు.
వసూలవుతాయూ!
Published Wed, Feb 18 2015 2:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement