గద్వాల/గద్వాలన్యూటౌన్ : అర్హుల ఎంపికలో పొరబాట్ల ను సరిదిద్ది అర్హులైన వారందరికీ ‘ఆసరా’ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ చైర్మ న్ బండారి భాస్కర్ అన్నారు. ఆది వారం స్థానిక పీజేపీ క్యాంపు కాలనీ లో గద్వాల ఆర్డీఓ అబ్దుల్ హమీద్ అధ్యక్షత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ రూ అధైర్యపడరాదని,ప్రచారాలు న మ్మరాదని సూచించారు.
అర్హులందరికీ పింఛన్లు అందుతాయని, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే బాదితులకు న్యా యం జరిగేలా చూస్తామన్నారు. అర్హులను కూడా తొలగిస్తున్నట్లు ప్రచారం చేయడంలో అర్థం లేదన్నారు. ఎమ్మె ల్యే డీకే అరుణ మాట్లాడుతూ అర్హులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తమ హయూంలో అర్హులందరికీ పింఛన్లను అందించామన్నారు.
ఈ విషయంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని కోరారు. ఇందుకుగాను తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆర్డీఓ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని, ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
మాటల తూటాలు...
జడ్పీచైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని అప్పటి సీఎం అన్నా స్పందించనివారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేయడం భావ్యం కాదన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏనాడూ తెలంగాణ జెండా మోయని వ్యక్తులు, ఉద్యమంలో పాల్గొనని వారు టీఆర్‌ఎస్ పేరిట నేతలుగా ఎదిగి మాట్లాడటం సరికాదన్నారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ బదులిస్తూ తెలంగాణ కోసం ధర్నాలు చేస్తే జైళ్లలో పెట్టించారన్నారు. ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ఇది సంక్షేమ వేదికైనందున రాజకీయాలు వద్దని, అవసరం వచ్చినప్పుడు ఎవరేంటో తేల్చుకుందామని ముగించేశారు.
అర్హులందరికీ పింఛన్లు
Published Mon, Nov 10 2014 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement