
‘డబుల్’ కోసం భూముల పరిశీలన
ఘట్‌కేసర్ టౌన్: సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం మండల కేంద్రంలోని మైసమ్మ గుట్ట కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఘట్టుమైసమ్మ ఆలయం వెనకాల ఉన్న సర్వేనంబర్ 543/2 గల ప్రభుత్వ భూమి ఇళ్లు నిర్మించడానికి అనువుగా ఉందో లేదోనని తెలుసు కోవడానికి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. మల్కాజ్‌గిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఘట్‌కేసర్ తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల హౌజింగ్ ఏఈ రమేష్, వీఆర్‌ఓ మల్లేష్ ఉన్నారు.
ఆసరా పింఛన్లు అందుతున్నాయా..?
ఘట్‌కేసర్: మండల పరిధిలో పలు గ్రామాల్లోని సర్కార్ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఏదులాబాద్ గ్రామంలో ఉన్న 185 సర్వేనంబర్‌లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 10 ఎకరాలను అసైన్డ్ పట్టాదారులు ఉన్నారు. అదేవిధంగా ప్రతాప్‌సింగారంలో సర్వేనంబర్ 378లోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు. తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఏదులాబాద్‌లో ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని కలెక్టర్ అక్కడే ఉన్న సర్పంచ్ మూసీ శంకరన్నను అడిగారు.
గ్రామాభివృద్ధికి నిధులు కావాలని సర్పం చ్ కలెక్టర్‌ను కోరారు. మూసీనది కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందిపాలవుతున్నారని సర్పంచ్ చెప్పారు. ఆసరా పింఛన్లు అందరికి అందుతున్నాయా..? అని కలెక్టర్ అడుగగా.. అందరికి అందుతున్నాయని.. ఇంకా కొందరికి అందాల్సి ఉందని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపా రు. ఔటర్ రింగురోడ్డు, బైపాస్‌రోడ్డు భూనిర్వాసితుల సమస్యల గురించి తహసీల్దార్‌ను సంప్రదించాలని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఐ ఆశ్విన్‌కుమార్, వీఆర్‌ఓ యాదగిరి, హౌసింగ్ ఏఈ రమేష్, ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి తదిరులు ఉన్నారు.
కీసర మండలంలో..
కీసర: మండల పరిధిలోని యాద్గార్‌పల్లిలో సర్వేనెంబర్ 225, చీర్యాల గ్రామంలో సర్వేనెంబర్ 59, 60 , కీసరలో సర్వే నెంబర్ 856లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ రఘునందన్‌రావు స్థానిక తహసీల్దార్ రవీందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. మండలంలో మొదటివిడతగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం యాద్గార్‌పల్లి, చీర్యాల, కీసర గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా కీసరలో 50 ఇళ్లను నిర్మించేందుకు ఎమ్మెల్యే సూచనప్రాయంగా అంగీకరించారని అధికారులు కలెక్టర్ కు వివరించారు. కీసరలో జీ+1 లేదా జీ+2 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
అనంతరం భోగారం గ్రామంలో వాటర్‌గ్రిడ్ పథకంలో భాగంగా నిర్మించనున్న సంప్ స్థలాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ జగదీష్, గ్రామ రెవెన్యూ కార్యదర్శి బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట్: శామీర్‌పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1284లో గల బస్‌స్టేషన్ పరిధిలో, మినీ స్టేడియం వద్ద గల ప్రభుత్వ స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రఘునందనరావు పరిశీలించారు. అనంతరం ఉప్పరిపల్లిలోని సర్వేనంబర్ 837 అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ స్థలాలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు ప్రభు త్వ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉందని.. అనువైన ప్రాంతలను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. హౌసింగ్ డీఈ నరేందర్‌రెడ్డి, శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా, శామీర్‌పేట్ సర్పంచ్ కిశోర్‌యాదవ్, వీఆర్వో ఫణీందర్, శ్రీనివాసచారి, నర్సింలు పాల్గొన్నారు.