భువనగిరి : బీబీగనర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు భువనగిరి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలను వివరించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భార్యే భర్తను కడతేర్చినట్టు విచారణలో వెల్లడైందన్నారు. బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందిన మెడబోయిన ప్రభాకర్‌కు(32) బీబీనగర్‌కు చెందిన గుండెగళ్ల సత్తయ్య కూతురు రేణుకతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రభాకర్ తన కుటుంబంతో పదేళ్ల క్రితం బీబీనగర్‌కు వలస వచ్చి రైల్వేస్టేషన్ సమీపంలో తన అత్త మామ ఇంటి పక్కనే అద్దె ఇంట్లో నివాసాముంటూ రాఘవాపురంలో రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్రభాకర్ భార్య రేణుక బీబీనగర్‌లో బిస్లరీ కంపెనీలో రోజు వారీ కూలీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బీబీనగర్‌కు చెందిన కాట్రోత్ విజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ప్రభాకర్ తరుచూ రేణుకను మందలించడం మొదలు పెట్టాడు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో రేణుకకు పద్దతి మార్చుకోవాలని చెప్పారు. దసరా పండుగ తర్వాత భార్యభర్తలిద్దరు రాఘవపురంలో నివసించాలని తీర్పు చెప్పడంతో వారు అక్కడికి మకాం మార్చారు. రాఘవపుంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత రే ణుక విజయ్‌తో సంబంధాలు కొనసాగించింది. ఏడాది తరువాత బీబీనగర్‌లోనే ఉంటానని రేణుక పేచిపెట్టింది. విధిలేక కొద్దిరోజుల్లోనే బీబీనగర్‌కు వచ్చారు. విజయ్ ఇంటికి సమీపంలోనే అద్దెకు నివసిస్తున్నారు.
మాత్రలు కలిపి.. ఊపిరి తీసి..
తన కార్యకలాపాలకు అడ్డు వస్తున్న భర్తను తప్పించాలని రేణుక నిర్ణయించుకుంది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 24వ తేదీన మద్యం సీసాతో ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. అతడికి తెలియకుండా మద్యం సీసాలో నిద్రమాత్రలు కలిపింది. రోజూ మాదిరిగా మద్యం తాగి ప్రభాకార్ నిద్రపోయాడు. వెంటనే తన ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి ప్రభాకర్‌ను గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు.
వివాహం చేసుకుంటా..
పిల్లన్ని చూసుకుంటా..
భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవడమే గాకుండా, ఇద్దరు పిల్లలలని తానే చూసుకుంటానని విజయ్ రేణుకకు హామీ ఇచ్చాడు. దీంతో వారి ఒప్పందం ప్రకారం హత్య తానే చేశాన ని చెప్పుకొచ్చిన రేణుక పోలీస్‌ల విచారణలో విజయ్ పేరు బయటపెట్టింది. కాగా విజయ్‌కు మంగళవారం మరో అమ్మాయితో వివాహం నిశ్చయించారు. హత్య జరిగిన రోజునుంచి కనపడకుండా పోయిన ఇద్దరు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ వద్ద అద్దె ఇల్లు తీసుకోవడానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారని డీఎస్పీ చెప్పారు. ఆయన వెంట సీఐ తిరుపతి ఉన్నారు.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
Published Wed, Jan 28 2015 4:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement