
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆక్వా ఎక్స్‌పో ఇండియా 2018 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదని, కోస్తా తీర ప్రాంతాల మత్స్యకారులను ఒక రకంగా, తెలంగాణ మత్స్యకారులను మరో విధంగా చూసేవాళ్లని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా సీడ్‌ను అందిస్తుందన్నారు. చేపల సీడ్ ఇవ్వడం నుంచి, అవి పెరిగాక కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి మంచి ధరకు అమ్మేదాక ప్రభుత్వం మత్స్యకారులకు తోడుగా ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుని మత్స్య సంపదను పెంచాలన్నారు. మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి తలసాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment