భార్యను గొడ్డలితో నరికి.. | Attack on his wife commit suicide with childrens | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికి..

Published Sun, Sep 25 2016 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

భార్యను గొడ్డలితో నరికి.. - Sakshi

భార్యను గొడ్డలితో నరికి..

- హీటర్‌ను పట్టుకుని ఇద్దరు కూతుళ్లు సహా తండ్రి ఆత్మహత్యాయత్నం
- తండ్రి, చిన్న కూతురు మృతి.. పెద్ద కూతురికి గాయాలు
- ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న భార్య లావణ్య
- నల్లగొండ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానమే కారణం
 
 తుర్కపల్లి: కుటుంబ కలహాలు ఓ వ్యక్తిని మృగాడిగా మార్చేశారుు. భార్యను గొడ్డలితో  నరికి ఆపై ఇద్దరు కూతుళ్లతో సహా తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పెద్దకూతురు ప్రమాదం నుంచి బయటపడగా తండ్రి, 8 నెలల చిన్నారి మృత్యుఒడికి చేరారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన దూశెట్టి రామచంద్రం(40)కి రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌కు చెందిన లావణ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అతడు వ్యవసాయంతోపాటు పాల వ్యాపారం చేసేవాడు. ఈ దంపతులకు స్రవం తి(2), అమ్ములు(8 నెలలు) కూతుళ్లున్నారు.

 అనుమానంతో చిత్రహింసలు
 భార్యను అనుమానించి రామచంద్రం చిత్రహింసలకు గురిచేసేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టినా అతడి లో మార్పు రాలేదని అన్నారు. గతంలో రామచంద్రం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు.

 పని కోసం వెళ్లి మైనర్‌ను అపహరించి..
  ఆరుమాసాల క్రితం పనికోసం మెదక్ జిల్లా తూఫ్రాన్‌కు వెళ్లాడు.  అక్కడ ఓ బాలికను అపహరించిన  కేసులో మూడు నెలలు జైలులో ఉండి పదిరోజుల క్రితమే విడుదలయ్యూడు. 3 రోజుల క్రితమే పుట్టింట్లో ఉన్న తన భార్యా,పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు.

 గొడ్డలితో దాడి చేసి.. ఆపై..
 శనివారం రామచంద్రం, లావణ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గొడ్డలితో లావణ్య ముఖంపై నరకడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోరుుంది. అనంతరం మరో గది లోకి వెళ్లి కరెంట్ హీటర్‌ను బిందెలో పెట్టి పట్టుకున్నాడు. ఈ క్రమంలో షాక్ కొట్టడంతో స్రవంతి ఎగిరి పక్కకు పడిపోగా, రామచంద్రం, అమ్ములు విద్యుదాఘాతానికి గురయ్యా రు. కొనఊపిరితో ఉన్న లావణ్య అరుపులు విని ఇరుగుపొరుగువారు ఘటనా స్థలానికి వచ్చారు.  లావణ్య,  స్రవంతిని భువనగిరికి, తరువాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement