కామారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో పెళ్లికి వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో 14 మందికి గాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి సింగరాయపల్లికి వెళుతుండగా ఉగ్రవాయి గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గాయపడ్డవారిలో డ్రైవర్ రాజిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ కామారెడ్డి డివిజన్‌కు చెందిన వారని సమాచారం. రాజిరెడ్డి, రాజమణి, దేవయ్య, తిరుపతి, అంజవ్వ, బూదవ్వ, ముత్తవ్వ, బూదేవవ్వ, లక్ష్మి, రవి, చంద్రం, మణెమ్మ, లింగయ్య, శ్వాస(3)లు చికిత్స పొందుతున్నారు.