ఎడ్‌సెట్–2017 షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాలకు జూలై 16న నిర్వహించనున్న ఎడ్‌సెట్– 2017 షెడ్యూల్‌ను సెట్ కమిటీ గురువారం జారీ చేసింది. ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 11న విడుదల చేయాలని నిర్ణ యించింది. అభ్యర్థులు ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో (్ఛఛీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn) దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ, ఎస్టీలకు రూ.200, ఇతరులకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించింది. జూలై 6లోగా ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తులను సమర్పించాలని సూచించిం ది. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 7, 8వ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చని చెప్పింది. ఎడ్‌సెట్ పరీక్షను జూలై 16న 11 నుంచి ఒంటిగంట వరకు 14 కేంద్రాల్లో నిర్వహించనుంది. ఫలితాలను జూలై 28న ప్రకటించనుంది. నేడు లాసెట్ ఫలితాలు..!: ఈ నెల 9వ తేదీన లాసెట్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
12 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
Published Fri, Jun 9 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
Advertisement