టీడీపీకి బన్నాల ప్రవీణ్ రాజీనామా | Bannala Praveen quits TDP to join TRS soon | Sakshi
Sakshi News home page

టీడీపీకి బన్నాల ప్రవీణ్ రాజీనామా

Published Tue, Jul 7 2015 7:16 PM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

Bannala Praveen quits TDP to join TRS soon

ఉప్పల్ (హైదరాబాద్) :  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉప్పల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బన్నాల ప్రవీణ్ టీడీపీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ చేసినట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితుడినై టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

తనతో పాటు జిల్లా తెలుగు యువత కార్యదర్శి కొంపల్లి రవీందర్, బీసీ సెల్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఇ.రవీందర్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, సీనియర్ నాయకులు కొంపల్లి రాజు, ఏలే వెంకటేశ్వర్లు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ భేతి సుభాష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement