బియాస్ బాధిత కుటుంబాల చేయూత
హైదరాబాద్: సైదాబాద్‌లోని వైదేహి ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియాస్ బాధిత కుటుంబాల వారు బుధవారం సాయం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహంలో 25 మంది వీఎన్‌ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. నేటితో రెండు సంవత్సరాలు కావడంతో వైదేహీ అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు బాధిత కుటుంబాల వారు బట్టలు పంపిణీ చేశారు.