భద్రాచలంలో 100 పడకల హాస్పిటల్
Published Mon, Jul 24 2017 3:52 PM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, సున్నం రాజయ్య, కోరం కనకయ్య, కలెక్టర్ రాజీవ్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గర్భిణీలు ఇంటివద్ద ప్రసవం కాకుండా ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే రూ.13 వేల నగదు, కేసీఆర్ కిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Advertisement