బ్రాందీవాదులెవరో ప్రజలకు తెలుసు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
వైరా: బ్రాందీవాదులు, గాంధీవాదులు ఎవరో రాష్ట్ర ప్రజ లకు తెలుసని, కాంగ్రెస్ పార్టీపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు చేయడం మానుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హితవు పలికారు.
మత్తు వదిలించుకొని, రైతుల వద్దకు వస్తేనే ఇబ్బందులు తెలుస్తాయన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం, తాటిపూడి గ్రామాల మధ్య అకాల వర్షాలకు నష్టపోరుున పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోరుున రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు.