'తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ కేబినెట్లో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రిగా గవర్నర్ ప్రమాణం స్వీకారం చేయించిన వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఖజాజాకు గండి కొట్టే విధంగా టెండర్లు లేకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇన్నోవాలు, మోటార్ వెహికల్స్, ట్రంక్ పెట్టెలు కొనుగోలు చేయటంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా సాగుతున్న కేసీఆర్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు.