ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో రూ.15 కోట్లు పెండింగ్ బిల్లుల విడుదల
మంత్రి తుమ్మల ఆదేశంతో అధికారుల్లో కదలిక
{పగతిలో ఉన్న ఇళ్లకు చెక్ మేజర్ మెంట్‌కు అధికారుల సమాయత్తం
ఖమ్మం వైరారోడ్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో కదలిక వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ బిల్లులు విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదే శాలు ఇచ్చారు. పెండింగ్ ఇందిరమ్మ బిల్లులు త్వరితగతిన చెల్లించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు.
సీబీసీఐడీ విచారణతో ఈ పరిస్థితి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి చోటుచేసుకుందని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీబీసీఐడీ బృందాలు గత ఏడాది నియోజకవర్గాలవారీగా క్షేత్ర స్థారుులో విచారణ చేపట్టారుు. ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో భారీ స్థారుులో అక్రమాలు జరిగినట్లు తేలింది. అరుుతే ప్రభుత్వం ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. విచారణ సమయంలో గృహ నిర్మాణ సంస్థ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపివేసింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలో 5020 ఇళ్లకు చెల్లింపులు
సీబీసీఐడీ విచారణ సమయంలో జిల్లాలో 64 వేల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోయాయి. విచారణ పూర్తరుు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన తర్వాత జిల్లాలో ఈ ఏడాది 12,262 ఇళ్లకు సుమారు రూ.30 కోట్లు వివిధ దశల్లో ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మరో 5 వేల ఇళ్లకు మోక్షం కలగనుం ది. అధికారులు వాటికి సంబంధించిన ఇళ్లను చెక్ మెజర్‌మెంట్ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచారు. త్వరలో లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమకానున్నాయి.
ప్రగతిలో ఉన్న ఇళ్ల చెక్ మెజర్‌మెంట్ చేయాలి
జిల్లాలో ప్రగతిలో ఉన్న ఇళ్లకు త్వరితగతిన చెక్‌మెజర్‌మెంట్ పూర్తి చేయాలని సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్ వైద్యం భాస్కర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లాలో ని డీఈ, ఈఈలతో అత్యవసర సమావేశం ఏర్పా టు చేశారు. పూర్తయిన ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని, వాటికి సంబంధిన ఆన్‌లైన్ నమో దు త్వరితగతిన పూర్తి చేయూలన్నారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లింపులు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
బిల్లులు వచ్చేస్తున్నాయ్!
Published Sat, Aug 8 2015 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement