Indiramma bills
-
బిల్లులు వచ్చేస్తున్నాయ్!
ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో రూ.15 కోట్లు పెండింగ్ బిల్లుల విడుదల మంత్రి తుమ్మల ఆదేశంతో అధికారుల్లో కదలిక {పగతిలో ఉన్న ఇళ్లకు చెక్ మేజర్ మెంట్‌కు అధికారుల సమాయత్తం ఖమ్మం వైరారోడ్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో కదలిక వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ బిల్లులు విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదే శాలు ఇచ్చారు. పెండింగ్ ఇందిరమ్మ బిల్లులు త్వరితగతిన చెల్లించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు. సీబీసీఐడీ విచారణతో ఈ పరిస్థితి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి చోటుచేసుకుందని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీబీసీఐడీ బృందాలు గత ఏడాది నియోజకవర్గాలవారీగా క్షేత్ర స్థారుులో విచారణ చేపట్టారుు. ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో భారీ స్థారుులో అక్రమాలు జరిగినట్లు తేలింది. అరుుతే ప్రభుత్వం ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. విచారణ సమయంలో గృహ నిర్మాణ సంస్థ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపివేసింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో 5020 ఇళ్లకు చెల్లింపులు సీబీసీఐడీ విచారణ సమయంలో జిల్లాలో 64 వేల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోయాయి. విచారణ పూర్తరుు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన తర్వాత జిల్లాలో ఈ ఏడాది 12,262 ఇళ్లకు సుమారు రూ.30 కోట్లు వివిధ దశల్లో ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మరో 5 వేల ఇళ్లకు మోక్షం కలగనుం ది. అధికారులు వాటికి సంబంధించిన ఇళ్లను చెక్ మెజర్మెంట్ పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరచారు. త్వరలో లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమకానున్నాయి. ప్రగతిలో ఉన్న ఇళ్ల చెక్ మెజర్మెంట్ చేయాలి జిల్లాలో ప్రగతిలో ఉన్న ఇళ్లకు త్వరితగతిన చెక్‌మెజర్‌మెంట్ పూర్తి చేయాలని సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్ వైద్యం భాస్కర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లాలో ని డీఈ, ఈఈలతో అత్యవసర సమావేశం ఏర్పా టు చేశారు. పూర్తయిన ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని, వాటికి సంబంధిన ఆన్లైన్ నమో దు త్వరితగతిన పూర్తి చేయూలన్నారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లింపులు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు. -
రూ.2.26 కోట్ల ‘ఇందిరమ్మ’ స్కామ్ నిందితుడి అరెస్టు
గుడ్లూరు: అనర్హులకు ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేసి రూ.2.26 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు. మంగళవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007-08 ఇందిరమ్మ గృహాల నిర్మాణం ఫేజ్-1, ఫేజ్-2 కింద మండలంలోని అమ్మవారిపాలెం, బసిరెడ్డిపాలెం, మోచర్ల, నాయుడుపాలెం, పోట్లూరు, చినలాటరఫి, కొత్తపేట, గుడ్లూరుల్లో అనర్హులైన 1543 మందికి ఇళ్లు నిర్మించుకోకుండానే నిర్మించుకున్నట్లు, వారికి రూ.2.26 కోట్ల బిల్లులు చెల్లించినట్లు అప్పటి గృహ నిర్మాణ శాఖ ఏఈ భావన్నారాయణ రికార్డుల్లో నమోదు చేశారు. దీనిపై జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు విచారణ చేయగా గృహాలు నిర్మించకుండానే బిల్లులు చెల్లించినట్లు తేలింది. 2009లో భావన్నారాయణను సస్పెండ్ చేయడంతో పాటు.. ఆయనపై గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పటి డీఈ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఐదేళ్లుగా భావన్నారాయణ తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాడని సమాచారం అందుకున్న ఎస్సై హుస్సేన్‌బాషా ఆయన్ను అరెస్టు చేశారు. భావన్నారాయణను కందుకూరు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. -
అక్రమాల పుట్ట పగులుతోంది!
బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్‌లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వర్నీ వదలం.. బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు. ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు. బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.