'కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి'
Published Fri, Sep 8 2017 2:30 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 11,12,13 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విమోచన దినోత్సవంపై కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. రైతు సమితుల ఏర్పాటుపై జారీ చేసిన జీవో 39 అప్రజాస్వామికమని.. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం చాలని.. కొత్తది అవసరం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో బీజేపీ మంత్రులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనేది మోదీ విధానం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
కాగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమోచన యాత్ర ముగించుకొని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్న లక్ష్మణ్‌కు ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం తెలిపారు
Advertisement
Advertisement