'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు' | bjp leader k.laxman slams cm kcr over Telangana Liberation Day | Sakshi
Sakshi News home page

'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు'

Published Thu, Aug 31 2017 2:35 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు' - Sakshi

'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు'

హైదరాబాద్‌: తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుందని.. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. 'రజాకార్ల ఆగడాలకు సాక్షాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని సందర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిబడిన దినోత్సవాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పించుకుంటున్నారు.
 
నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన కేసిఆర్ ఇప్పుడు తనేందుకు విస్మరిస్తున్నాడు? తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని నాడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్‌ కుర్చి ఎక్కాక మాట మారుస్తున్నారు' అని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement