
రుణమాఫీపై దాగుడు మూతలొద్దు
న్యూఢిల్లీ: తెలంగాణలో రైతుల రుణమాఫీపై ప్రభుత్వం, బ్యాంకర్లు దాగుడు మూతలాడకుండా సంయుక్త ప్రకటన చేయాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలన్నారు. ఢిల్లీ ఏపీభవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు.