20న మండలాల్లో బీజేపీ దీక్షలు
► ముస్లిం రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న ముస్లిం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న అన్ని మండల కేం ద్రాల్లో నిరసన దీక్షను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమా న్ని విస్తరించడంలో భాగంగా వివిధ రూపా ల్లో ఆందోళనలు, నిరసనలను కొనసాగించా లని సోమవారం జరిగిన రాష్ట్ర పార్టీ పదాధి కారుల సమావేశంలో నిర్ణయించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచడం వల్ల రాష్ట్రంలోని బీసీల రిజర్వేషన్లలో కోత పడు తుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు.
ఇప్పటికే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను అమలు చేయడంవల్ల జీహెచ్ ఎంసీలో బీసీలకు జరిగిన నష్టాన్ని తగిన సమాచారంతో ప్రజలకు వెల్లడించాలని నిర్ణ యించింది. దీనివల్ల బీసీలకు మరింత నష్టం జరుగుతుందనే వాదనను వినిపించేందుకు కార్యాచరణ రూపొందించనుంది. మండల, జిల్లాస్థాయిల్లో నిర్వహించే నిరసనలను పర్య వేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది నాయకులను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది.
ముస్లిం బిల్లు నేపథ్యంలో పార్టీ కార్య కర్తలు, నాయకులు 11 వేల మందిని అరెస్ట్ చేసి, కొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంతోపాటు రిమాండ్‌కు పంపడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపైనా ఆందోళనలను నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నాయకులు పేరాల శేఖర్ రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ల ముట్టడి.. ముఖ్య నేతల అరెస్ట్
ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లను పెంపునకు నిరస నగా సోమవారం 31జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బీజేపీ నిరసనలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలతోపాటు దాదాపు 6 వేల మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. రంగా రెడ్డిలో కె.లక్ష్మణ్, హైదరాబాద్‌లో మురళీధర్ రావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సంగా రెడ్డిలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే రాజాసింగ్, నల్లగొండలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మేడ్చెల్‌లో ఎమ్మె ల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మహబూబ్‌న గర్‌లో నాగం జనార్దనరెడ్డి పాల్గొన్నారు.