మద్యం మత్తులో బీజేపీ నేత డ్రైవర్ వీరంగం | BJP sudeesh rambotla driver ramakrishna behave rudely | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో బీజేపీ నేత డ్రైవర్ వీరంగం

Published Tue, Jun 2 2015 7:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP sudeesh rambotla driver ramakrishna behave rudely

హైదరాబాద్: మద్యం మత్తులో ఓ బీజేపీ నేత డ్రైవర్ వీరంగం చేశాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ స్కూటరిస్టులను ఢీకొనడమే కాకుండా, వారిపై చేయి చేసుకున్న డ్రై వర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని సాగర్ సొసైటీలో నివసించే బీజేపీ నేత సుధీశ్ రాంబొట్ల డ్రైవర్ రామకృష్ణ మంగళవారం మధ్యాహ్నం ఇన్నోవా కారును మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా ఉన్న స్కూటరిస్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో సురేష్‌యాదవ్, సంతోష్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఇదేంటని వారు అడగ్గా నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామకృష్ణ వారిపై దాడికి దిగాడు.

ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అనే పేరుతో స్టికర్ కూడా ఉన్నట్లు పోలీసులు గమనించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement