
లాంతర్లతో అసెంబ్లీకి టీ. బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు బషీర్బాగ్ నుంచి లాంతర్లతో అసెంబ్లీకి బయల్దేరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు బీజేపీ పేర్కొంది.