అనాథ పిల్లలకు భోజనం వడ్డిస్తున్న వంశీ రక్తదానం చేçస్తూ..
రసూల్‌పురా : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారి రక్తం అందక తన కళ్ల ముందే చనిపోవడం అతడిన మనసును కలచివేసింది. దీంతో చావుబతుకుల్లోఉన్నవారికి రక్తదానంతో ప్రాణం పోయాలనే నిశ్చయంతో ఓ యువకుడు నడుం కట్టాడు. అతడి సేవాతత్పరతకు ముగ్గురు స్నేహితులు కూడాజతకూడారు. రక్తందానం చేసే వారి వివరాలతో బ్లడ్ డోనర్స్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రాంతం ఎక్కడైనా డోనర్స్‌తో సకాలంలో రక్తం అందించి పలువురి ప్రాణాలను కాపాడుతున్నారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్లు,బస్‌స్టేషన్లు రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై ఉండే అనాథలకు, వీధి బాలలకు, వృద్ధులకు కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉంటున్నమతిస్థిమితం లేనివాళ్లకు స్వయంగా కటింగ్, షేవింగ్, స్నానాలు తామే స్వయంగా చేస్తున్నారు. గాయాలకు ఆయింట్‌మెంట్ రాస్తున్నారు. మందులను అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు బోయిన్‌పల్లికి చెందిన ఆర్యవంశీ, అతని స్నేహితులు. రక్తదానం, అనాథలకు సేవ చేయాలనే ఆలోచన ఎందుకువచ్చిందనే విషయంపై ఆర్యవంశీ ఇలా వివరించాడు.
నా కళ్లెదుటే ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో రక్తం అందక అసువులు బాసింది. ఈ ఘటన నాలో ఓ ఆలోచన కలిగించింది. ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతుల మిన్న మదర్ థెరిస్సా సూక్తిని ఆదర్శంగా తీసుకుని నా ఆలోచనకు ఆచరణలో పెట్టాను. ప్రతిరూపంగా బ్లడ్‌డోనర్స్ వాట్సప్ గ్రూప్ సృషించి రక్తదానం చేసే వారి ఫోన్ నంబర్లను సేకరించాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందజేస్తున్నాం. పూట గడవని కుటుంబాలకు బుస సుమ, భాస్కర్, అల్లాడి గంగ, చాణక్య దాతల సహాయంతో సరుకులు, బియ్యం అందజేస్తున్నాం. బోయిన్‌పల్లిలోని తారా ఫౌండేషన్, మంచి కలలు అనాథ సంస్థల్లో ఉంటున్న వారికి భోజనం, క్షుర సేవలు అందజేస్తున్నాం. స్నేహితురాలు రేణుక, ఉప్పుగూడకు చెందిన శ్రీకాంత్, నల్లగుట్టకు చెందిన శ్రవణ్‌లు అండగా ఉంటున్నారు. వీరే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులు సుఖేందర్‌రెడ్డి సర్వ్ నీడి గౌతమ్, సర్కార్ ఫౌండేషన్ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అనాథ వృద్ధురాలు దారి తప్పి నగరానికి చేరుకోవడంతో ఆమెను అనాథాశ్రమంలో చేర్పించాం. ఇప్పటివరకు 5వందల మందికిపైగా రక్తం అందించాం.
రక్తం అవసరం ఉన్నవారు వాట్సప్ నంబర్
87127 34487, 63003 72886లను సంప్రదించవచ్చు
Comments
Please login to add a commentAdd a comment