రఘునాథపల్లి : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రఘునాథపల్లి మండలంలోని శ్రీమన్నారాయణపురంలో శనివారం ఆయన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యమ నేత కాసం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు ఎలాం టి స్ఫూర్తి చూపారో... అభివృద్ధిలో ముం దుకు సాగకుండా అడ్డుకుంటున్న శక్తులపైనా అదే స్ఫూర్తి చాటాలన్నారు.
తెలంగాణ అమరవీరుల రుణం తీర్చుకోనిదని, వారి కుటుంబాలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఉద్ఘాటిం చారు. అమరులెందరున్నా... ఆదుకుంటామన్నారు. అమరుల జ్ఙాపకార్థం స్థూపం నిర్మించిన సత్యనారాయణ, చింత స్వామి అభినందనీయులన్నారు. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రజ ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారన్నారు.
అనంతరం మంత్రులను టీఆర్‌ఎస్ నేతలు గజమాలతో సత్కరించారు. సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, జనగామ, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, వినయ్‌బాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యులు బానోతు శారద, రంజిత్‌రెడ్డి, సర్పంచ్ మాచర్ల సోమలక్ష్మి, నాయకులు గొరిగ రవి, నామాల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, గోపాల్‌నాయక్, దాసరి బుగ్గయ్య, శేరి లక్ష్మారెడ్డి, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యుత్ కష్టాలకు బాబే కారణం
Published Sun, Oct 26 2014 4:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement