ఓ వ్యక్తి స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ఓ వ్యక్తి స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్యామ్యూల్, చంద్రశేఖర్‌లు ప్రైవేట్ ఉద్యోగులు. వీరు కొన్నాళ్లుగా చనువుగా ఉంటున్నారు. అయితే శ్యామ్యూల్.. చంద్రశేఖర్ భార్యా, పిల్లలతో అసభ్యంగా మాట్లాడటంతో ఆగ్రహం చెందిన చంద్రశేఖర్ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో శ్యామ్యూల్ అక్కడికక్కడే మృతి చెందాడు.