విద్యార్థి దారుణ హత్య | brutal murder of a student | Sakshi
Sakshi News home page

విద్యార్థి దారుణ హత్య

Published Sun, Oct 25 2015 9:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

brutal murder of a student

పొలం వద్దకు వెళ్లిన విద్యార్థిని దుండగులు దారుణంగా చంపేశారు. ఈ హత్య మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం బోల్ వోనిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదువుతున్న రమేశ్ అనే యువకుడిని అగంతకులు కిరాతకంగా చంపేశారు. విద్యార్థి కాళ్లు చేతులు కట్టి, పురుగుల మందు తాపి హత్యచేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పొలం వివాదమే ఈ హత్యకు కారణం అయి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement