అక్కరకు రాని చుట్టము.. అన్నట్లు జిల్లాలోని ఊట్కూర్ మండలకేంద్రానికి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్.. పదిహేనేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్టీసీ అధికారుల నిర్లక్షం, ప్రజా ప్రతినిధుల అలసత్వంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణంతో ప్రయాణీకులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. అయితే గ్రామానికి అరకిలోమీటర్ దూరంగా నిర్మించడం కూడా ఈ బస్టాండ్ కు మరో శాపం.
రూ. 7.5 లక్షల వ్యయంతో తలపెట్టిన ఈ బస్టాండ్ నిర్మాణానికి నాటి మంత్రి, దివంగత ఎల్కోటి ఎల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయినా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగలేదు. దీంతో ప్రభుత్వ వాహనాలను అక్కడ నిలపడంలేదు. ప్రస్తుతం ఆ ప్రాంగణం బొగ్గు బట్టీ కార్మికులకు ఆవాసంగా మారింది. పాతబస్టాండ్ వద్ద ప్రయాణీకులు ఉండేందుకు కనీసం షెల్టర్‌ను ఏర్పాటు చేసి కొత్త బస్టాండ్ మీదుగా బస్సులు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.
కట్టారు.. మరిచారు!!
Published Sun, Apr 19 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement