useless
-
శతక నీతి – సుమతి: సత్సాంగత్య ఫలం
మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుపకాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగదీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంతా అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మలనుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి. ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్తకాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయలేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడుతుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి, ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థమైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. ‘నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవరకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టుకుంటాను’ అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగుతుంది. అంతేతప్ప తనకోసం బతికేవాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించేవాడూ, పదిమందికి ఆదర్శం కానివాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు, కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు, ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభవిస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ, వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి.. ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మూడు కోట్లు మూసీలో పోశారు!
వృథా నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షంగా మార్చాలన్న తలంపుతో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపయోగంగా మారింది. పథకం ఏర్పాటు లక్ష్యం మంచిదైనప్పటీకీ అధికారుల నిర్ణయాలు, ప్రజా ప్రతినిధుల దురాలోచనలతో అది మూలనపడింది. దీంతో రైతులకు మేలు జరగక పోగా, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ కోవకు చెందినదే పొదిలి మండలంలోని పాములపాడు పంచాయతీలో గల కాశీపురం ఎత్తిపోతల పథకం. పొదిలి రూరల్: పొలం పక్కనే నీరు ప్రవహిస్తున్నా అది పైర్లకు ఉపయోగపడకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఆ నీటిని సాగుభూములకు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. మండలంలోని పాములపాడు, గొల్లపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో 1988–89 సంవత్సరంలో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో మూíసీనదిపై ఈ పథకాన్ని నిర్మించారు. దీనికి 25 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు విద్యుత్ మోటార్లు, నీటి సరఫరాకు పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కాకున్నా పథకం మొదట్లో కొంతమేరకు పనిచేసింది. నీటి సరఫరా లేక సాగు తగ్గి నిర్వహణ లోపంతో మూడేళ్ల అనంతరం రైతులు ఒక లక్ష రూపాయలు పైబడి విద్యుత్ బకాయిలు పడ్డారు. కరెంట్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అధికారులు సరఫరా తొలగించారు. పథకం పని చేయక పోవడంతో మోటార్లు, భవనం తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అక్కడ పిచ్చి చెట్లు పెరిగి సాగు భూములు బీడుగా మారాయి. ప్రజల విన్నపం మేరకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం పథకం గ్రౌండ్ రిపోర్టు తయారు చేసింది. రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిప్రాయాలు తెలుసుకొని పథకానికి అక్కడ అనువైన ప్రాంతం కాదని, కుంచేపల్లి మూసీనది మాగాణి వద్ద ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని పెర్కొంటూ నివేదిక పంపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడి: కాశీపురం ఎత్తిపోతల పథకంను కుంచేపల్లి వద్ద పునర్నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, అధికారులు మొత్తుకున్నా వారి మాటలును గత తెలుగుదేశేం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆపార్టీ నాయకులు అప్పటి అధికారులపై వత్తిడి తెచ్చి పనిచేయని పథకానికి మరమ్మతుల కోసం రూ.3.20 కోట్లతో ఎస్టిమెషన్ వేయించి మంజూరు చేయించారు. ఈ పథకానికి 10 క్యూసెక్కులు నీటి పరిమాణం అవసరమని అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టు బావి, సంపు నిర్మాణాలు చేపట్టినట్లు కాకి లేక్కలు చూపి పాత పథకానికే ఏవో కొన్ని మొక్కుబడి పనులు చేసి మసిపూచి మారేడుకాయ చేశారు. పాత భవనాన్ని మర్మతులు చేసి, తలపులు బిగించి, మోటార్లు రీపేరు చేయించి, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పథకానికి నీరు రావాలంటే మూసీ నదిలో నీరు నిల్వ ఉండాలి. నీరు నిల్వ ఉండాలంటే నదికి అడ్డంగా కట్టనిర్మించాలి. కానీ ఇక్కడ అలాంటి పని చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించినా పథకం పనిచేయలేదు. మూసీనదిలో ఇసుక మేట వేయడం, పథకం ప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దీంతో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పటికీ నది వద్ద చుక్కనీరు నిల్వ ఉండక పోవడం కొసమేరుపు. వందలాది ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ స్కీం వినియోగంలోకి తీసుకురాక పోతే మరలా సామగ్రి దొంగల పాలౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఖ్యాతిగాంచిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమైనా నదిలో నీరు నిల్వ ఉండటానికి అడ్డు కట్ట వేసి ఈ స్కీం వినియోగంలోకి తీసురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. -
వ్యవసాయ మార్కెట్ గోదాం ‘మమ’
మధిర మార్కెట్ యార్డుకు అనుసంధానంగా రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ గోదాం నిరుపయోగంగా మారింది. 2010లో నాటి డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సబ్‌మార్కెటింగ్ యార్డుకు ప్రారంభోత్సం చేశారు. దీంతోపాటు రూ.2లక్షల వ్యయంతో పంటను ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫాం కూడా నిర్మించారు. కానీ ప్రారంభానికే పరిమితమైంది. ఈ మార్కెట్ గోదాం ఉపయోగంలోకి రాలేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పట్టించుకునే వారు లేరు. బోనకల్ : మార్కెట్ గోదాం ఆవరణం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి చిట్టడవిని తలపిస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్ శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో గోదాం మూత పడింది. దీంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు పంటలను మధిర, ఖమ్మం తరలిస్తున్నారు. మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్‌మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసి గోదాంలో నిల్వచేయాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ప్లాట్‌ఫాం పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులు ధాన్యాన్ని, మార్కెట్‌కు తీసుకొచ్చే పంటలను ప్లాట్‌ఫాంపై ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉగయోగించని మార్కెట్ యార్డ్‌కు ఇటీవల రూ.1లక్షతో ఖర్చు ఆర్చి నిర్మించారు. సబ్ మార్కెట్‌యార్డును ప్రారంభిస్తే రైతులకు సౌకర్యంగా ఉండటంతోపాటు, నిరుపయోగంగా ఉన్న గోదాం, ప్లాట్‌ఫాం వినియోగంలోకి వస్తుందని రైతులు అంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభించాలి... బోనకల్లో నిర్మించిన సబ్‌మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలి. పండించిన పంటలను దూరప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాం కూడా ఉందని, కానీ సిబ్బంది లేకపోవడంతో రైతులు ఎవరు తమ పంటలను దాచుకోవడం లేదు. – బందం అచ్చయ్య, రామాపురం, రైతు మార్కెట్ లేక రైతుల అవస్థలు... రైతుల కోసం నిర్మించిన సబ్‌మార్కెట్ యార్డులో కొనుగోళ్లు జరుపకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్ యార్డు నిర్మించారే తప్ప, కొనుగోళ్లు లేకపోవడంతో గోదాం నిరుపయోగంగా మారింది. ముళ్లపొదలు, చెట్లతో నిండి ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. –హనుమంతరావు, రైతు ముష్టికుంట్ల -
‘విజ్ఞానా’నికి బూజు.!
వైరా : వంద అక్షరాల్లోని భావాన్ని ఒక్క చిత్రంలో చూపవచ్చు. వంద చిత్రాల సారాంశాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. విద్యాశాఖలో మేధావులు నమ్మే విలువైన మాటలివి. ఆ దిశగా సత్ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక బోధన.. చివరకు ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. అంతంత మాత్రం నిధులు, అందీ అందని ప్రయోగ పరికరాలు, నిధులు దున్వినియోగం వెరసీ విద్యార్థులకు సైన్స్ విద్య అందడం లేదు. మౌఖిక బోధనతోనే పాఠాలు చెప్పి సరిపెడుతున్నారు. దీంతో విలువైన విజ్ఞాన పరికరాలకు దుమ్ము పడుతోంది. సులువుగా అర్థమయ్యేలా.. నియోజకవర్గంలో మొత్తం 37 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వైరా మండలంలో 9, కొణిజర్ల మండలంలో 7, ఏన్కూరు మండలంలో 8, కారేపల్లి మండలంలో 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 6,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే వీలుగా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. కొంతకాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికారాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశ్యం. అయతే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, ఆ నిధులతోనే మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో అసలు సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల కొనుగోలు చేసిన పరికారలు వాడక మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. నిధులున్నా పరికరాల్లేవ్.. 2009–10 విద్యాసంవత్సరం నుంచి 2018వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009–10లో ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున, 2010–11లో రూ.17,125 చొప్పున, 2011–12లో రూ. 15వేల చొప్పున సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 2008 నుంచి 2010 వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఏటా లక్షలాది రూపాయిల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం దక్కడం లేదు. ప్రయోగాత్మక బోధన కరువు... విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. ప్రస్తుత కృత్యధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పదేళ్ల కిందట పాఠ్య పుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతోపాటు, ఆ విధంగా బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సైన్స్ పరికరాలతో విద్యాబోధన చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సైన్స్ పరికరాలతోనే విద్యాబోధన చేయాలి. మారిన పుస్తకాల్లోని అంశాలతో ప్రయోగాలు చేస్తే పాఠాలు బోధించే పరిస్థితి లేదు. ప్రతి పాఠశాలలో ప్రయోగశాల ద్వారా బోధన చేయాల్సిందే. – కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా -
ఆ భూములను వాడుకునే వీలు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ, రైల్వేశాఖ అధీనంలోని భూములు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాలకు వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ‘అవసరార్థం స్థిరాస్తి సేకరణ చట్ట సవరణ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల రక్షణశాఖకు చెందిన బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు ఆ శాఖ అంగీకరించింది. రక్షణ అవసరాల కోసం హైదరాబాద్‌లో రక్షణశాఖకు భూములిస్తే.. ఆ శాఖ స్థానికంగా ఉండే ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిబంధనలు పెడుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వేధింపులు మానుకోవాలి. జాతీయ భద్రత గురించి భూములు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకొని చర్చలు జరపాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూములు బదిలీ చేసుకోవాలి గానీ వెల కట్టడం సరికాదు’ అని అన్నారు. నాడు ‘కల్యాణలక్ష్మి’ ఉండుంటే..: కడియం తొర్రూరు రూరల్ (పాలకుర్తి): ‘నాకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు.. పేదలైన మా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు నానా కష్టాలు పడ్డారు.. ఇప్పటిలా కల్యాణలక్ష్మి ఉంటే మాకు ఆ ఇబ్బందులు ఉండేవి కావు’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం గ్రామంలో బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు ఆడపిల్లలేనని, ఒక్క కొడుకైనా కలగకపాయేనని కన్నతల్లి ఆవేదన చెందేదని, కానీ.. కూతుళ్లను ఉన్నతంగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దానని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లిది.. తనది ఒకే గ్రామమని.. ఉన్నత కుటుంబం నుంచి ఎర్రబెల్లి, పేద కుటుంబం నుంచి తాను అభివృద్ధి చెందామని అన్నారు. -
పల్లె వైద్యానికి గ్రహణం
* ఆస్పత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటులో జాప్యం * రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన అధికార పార్టీ * విభేదాలతో పలువురు కోర్టుకు * మూలనపడిన విలువైన యంత్రాలు సాక్షి, గుంటూరు: పల్లె వైద్యానికి అధికార పార్టీ గ్రహణం పట్టింది. మైనింగ్‌లు మొదలుకొని, మద్యం వరకు దేనినీ వదలని తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు వైద్యశాలలపై పడుతున్నారు. కాసుల కక్కుర్తిలో ప్రతి పనికి అడ్డు తగులుతూ సొంత ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఈ తంతు అధికంగా ఉంది. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, వాటి ద్వారా నిధులు వినియోగించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడం గానీ జరగడం లేదు. నిధులున్నా.. వినియోగమేదీ.. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరిపడా నిధులున్నా వినియోగించేందుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లనే ఏర్పాటు చేయలేదు. వాటి అనుమతి ఉంటేనే ఈ నిధులు వినియోగించాల్సిన పరిస్థితుల్లో కమిటీలను ఏడాదిన్నరగా ఏర్పాటు చేయకపోవడంతో అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో 11 ప్రభుత్వ ఆస్పత్రులకు స్కానింగ్ మిషన్లు మంజూరు చేసినా అవి నిరుపయోగంగా మారాయి. ఎనిమిది నెలల క్రితం జిల్లాకు వచ్చిన రూ.1.50 కోట్ల విలువ చేసే స్కానింగ్ మిషన్లు మూలన పడ్డాయి. నిరుపయోగంగా యంత్రాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక ప్రసవాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచిత స్కానింగ్ పరీక్షల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. రూ.1.50 కోట్లు వెచ్చించి జిల్లాలోని 11 ఆస్పత్రులకు వాటిని స్కానింగ్ మిషన్లను పంపించింది. సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, మాచర్ల, నగరం, వినుకొండ, కొల్లిపర, పిట్టలవానిపాలెం, పొన్నూరు, పెదకూరపాడు, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటిని చేర్చారు. స్కానింగ్ మిషన్లు వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. స్కానింగ్‌లు చేయాలంటే తప్పనిసరిగా డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో స్కానింగ్ మిషన్‌ను రిజిస్ట్రేషన్ చేయించాలి. మిషన్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ.35 వేలు డీడీ రూపంలో డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెల్లించాలి. సదరు సొమ్మును హెచ్‌డీఎస్ ఖాతాలో నుంచి డ్రా చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో స్కానింగ్ మిషన్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదు. రాజకీయ జోక్యం వల్లే జాప్యం... రాజకీయ జోక్యం వల్లే హెచ్‌డీఎస్ కమిటీలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మండలస్థాయి అధికారులను హెచ్‌డీఎస్ కమిటీలో సభ్యులుగా నియమించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప మండల స్థాయి అధికారులను తొలగించి వారి స్థానంలో తెలుగు తమ్ముళ్లకు చోటు కల్పించి హెచ్‌డీఎస్ కమిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. దీంతో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించి విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై వివాదం నెలకొని పలువురు కోర్టులను ఆశ్రయించడంతో హెచ్‌డీఎస్ కమిటీల నియామకాల్లో తెలుగు తమ్ముళ్లను పక్కన బెట్టాలని సూచించారు. అయినప్పటికీ వారి జోక్యం తగ్గకపోవడంతో నేటికీ పలు ఆస్పత్రుల్లో హెచ్‌డీఎస్ కమిటీలు ఏర్పడలేదు. ఒక్కో ఆస్పత్రిలో ఏడాదికి రూ.1.75 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వివిధ రకాల అభివృద్ధి పనుల నిమిత్తం హెచ్‌డీఎస్ ఖాతాలకు ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం ద్వారా విడుదల చేస్తుంది. ఏడాదిగా నిధులు హెచ్‌డీఎస్ ఖాతాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పలు మార్లు జిల్లాలో ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నప్పటికీ ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయ గ్రహణాన్ని తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కమిటీలు లేకే రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులు లేవు... జిల్లాలో 11 ఆస్పత్రులకు ఆరు నెలల క్రితం స్కానింగ్ మిషన్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో స్కానింగ్‌లు జరగడం లేదు. హెచ్‌డీఎస్ కమిటీలు లేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయలేకపోతున్నారు. జిల్లాలో 40 శాతం ఆస్పత్రులకు కమిటీలు ఏర్పాటయ్యాయి. మిగతా ఆస్పత్రులకు కమిటీలు ఏర్పడగానే అనుమతులు మంజూరు చేస్తాం. – డాక్టర్ పద్మజారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో -
అంపశయ్యపై అంబులెన్స్‌లు
* మొరాయించిన సీఎం కాన్వాయ్‌కు కేటాయించిన అంబులెన్స్ * జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి * అల్లాడుతున్న రోగులు గుంటూరు మెడికల్: సీఎం చంద్రబాబు నివాసం వద్దకు శుక్రవారం రాత్రి కాన్వాయ్ డ్యూటీలు నిర్వహించేందుకు గుంటూరు జీజీహెచ్ నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అంబులెన్సులో వెళ్లారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం 9 గంటల సమయంలో తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా, అంబులెన్సు ఇంజన్ ఆయిల్ కారిపోతూ వడ్డేశ్వరం వద్ద ఆగిపోయింది. దీంతో అంబులెన్సులో ఉన్న ముగ్గురు వైద్యులు, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక నాల్గో తరగతి ఉద్యోగి బస్సులో గుంటూరు వచ్చారు. ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ ఆగిపోయిన విషయం తెలియజేయడంతో వారు మరో ఇద్దరు డ్రైవర్లను పంపారు. వారు మరమ్మతులు చేసినా కదలకపోవడంతో ఆస్పత్రికి తాడు కట్టుకుని తీసుకొచ్చారు. మళ్లీ శనివారం రాత్రి కాన్వాయ్ విధులకు ఇబ్బంది లేకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్సును తీసుకొచ్చి జీజీహెచ్ సిబ్బందిని, వైద్యులను సీఎం నివాసం వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లిలో నివాసం ఉంటున్నప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, రాత్రి వేళల్లో గుంటూరు జీజీహెచ్ వైద్యులు కాన్వాయ్ విధులకు వెళుతున్నారు. అంబులెన్స్‌లు సక్రమంగా లేకపోవడంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏడు వాహనాలున్నా నిరుపయోగమే.. ఆసుపత్రిలో అంబులెన్సులు ఏడు ఉన్నప్పటికీ ఒక్కటీ పని చేయడం లేదు. శనివారం ఆగిపోయిన అంబులెన్సును ఏడేళ్ల క్రితం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి జీజీహెచ్‌కు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. రాజధాని ఆసుపత్రి గుంటూరులో అంబులెన్సులు లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు తీసుకెళ్లేందుకు రోగులు ప్రైవేటు వాహనాదారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా అంబులెన్సులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉన్నా.. లేనట్టే?
నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణాలు పలుచోట్ల నోచుకోని నిర్మాణాలు ఇబ్బందుల్లో ప్రయాణికులు.. పట్టించుకోని అధికారులు రేగోడ్: ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ప్రాంగణాలను నిర్మించడం లేదు. ప్రయాణం చేయాలంటేనే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్మించిన చోట్ల నిరుపయోగంగా కొన్ని ఉంటే.. మరికొన్ని మాత్రం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేగోడ్ మండంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో 25 గ్రామాలున్నాయి. 16 గిరిజన తండాలున్నాయి. పదమూడేళ్ల క్రితం అప్పటి మంత్రి బాబూమోహన్ లక్షలాది రూపాయలు మంజూరు చేయడంతో రేగోడ్‌లో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో బస్సు సర్వీసులు పలుమార్లు ప్రయాణ ప్రాంగణానికి వచ్చి వెళ్లాయి. తరువాత ఈ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. ప్రస్తుతం ఈ బస్టాండ్ గొడవలు పడినవారికి పంచాయితీలు నిర్వహించేందుకు, పశువులను కట్టేయడానికి మాత్రం ఉపయోగపడుతోంది. ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరుకుంటోంది. పోచారం గ్రామంలో ఇటీవల నిర్మించిన బస్‌షెల్టర్‌కు కలర్ కూడా వేయలేదు. కనీసం ఉపయోగంలోకి తేవడం లేదు. టి.లింగంపల్లిలో బస్‌షెల్టర్ నామమాత్రంగా వినియోగంలో ఉంది. మర్పల్లి, సిందోల్, గజ్వాడ, గజ్వాడకు వెళ్తుండగా తాటిపల్లి గట్టు మీద, దేవునూర్, మేడికుంద, దోసపల్లి, ప్యారారం, దుద్యాల, జగిర్యాల, బురాన్వాడి తండా, పెద్దతండా, నిర్జప్ల, ఉసిరికపల్లి, చౌదర్పల్లి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో బస్షెల్టర్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలు బస్సులు, ఆటోలు వచ్చే వరకు ఉండటానికి బస్షెల్టర్లు లేక వర్షాలకు తడస్తూ.. ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. చెట్ల కిందనో.. టీ హోటల్లో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డు
రామన్నపేట: గ్రామాల్లో పారిశుద్ధ్యంను మెరుగుపరిచే విషయంలో పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి కరువయింది. ఉపయోగించేవారు లేక లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌యార్డులు నిరుపయోగంగా మారాయి. రామన్నపేట మండలంలో 20గ్రామపంచాయతీలున్నాఇయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీపథకం కింద 17గ్రామాల్లో డంపింగ్‌యార్డులను తవ్వడం ప్రారంభించారు. స్థలాభావంవల్ల నిధానపల్లి, ఇస్కిళ్ల, సిరిపురంగ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. 10మీటర్ల వెడల్పు, 15మీటర్ల పొడవు, 2మీటర్లలోతు ఉండేవిధంగా 550 పనిదినాలు, రూ. 1.48లక్షల అంచనావ్యయంతో డంపింగ్‌యార్డ్‌లను తవ్వడం ప్రారంభించారు. వీటిలో బోగారం, దుబ్బాక, జనంపల్లి, కుంకుడుపాముల, లక్ష్మాపురం, మునిపంపుల, రామన్నపేట, సూరారం, ఇంద్రపాలనగరం, ఉత్తటూరు, వెల్లంకి, ఎన్నారం గ్రామాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పల్లివాడ, నీర్నెముల, కక్కిరేణి గ్రామాల్లో వివిధ కారణాలవల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గేదెనుకొని తాడుకు భయపడ్డ చందంగా ప్రభుత్వం లక్షలు వెచ్చించి డంపింగ్‌యార్డులను తవ్వి, వేలుపెట్టి చెత్త బండ్లను సమకూర్చలేక పోయింది. కూడిపోతున్న డంపింగ్‌యార్డులు పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోని మురుగుకాలువలు, వీధుల్లో తీసిన చెత్తను ట్రాక్టర్లు, తోపుడుబండ ్లద్వారా డంపింగ్‌యార్డులకు చేరవేయవలసి ఉంటుంది. డంపింగ్ యార్డులను తవ్వే సమయంలోనే గ్రామీణ నీటిసరఫరా పారిశుద్ధ్య విభాగంవారు చెత్తను రవాణా చేయుటకు అవసరమైన బండ్లను సమకూర్చుటకు అవసరమైన రిక్వైర్మెంట్ను కూడా తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏఒక్కగ్రామానికి బండ్లను అందజేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీసిన చెత్తను జనావాసాలకు దగ్గరల్లో పడవేస్తున్నారు. అక్కడ పందులు సంచిరిస్తూ జుగుత్సాకరమైన వాతావరణంను సృష్టిస్తున్నాయి. లక్షలువెచ్చించి తవ్విన డంపింగ్‌యార్డులలో పక్కనున్న మట్టిజారి కూడిపోతున్నాయి. కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి....నక్క రామనర్సయ్య,జనంపల్లి వీధులు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సర్కారువాళ్లు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీధుల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ప్రజలు కూడా తమ ఇంటి మాదిరిగానే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తబండ్లను సమకూర్చాలి.....దేశపాక లక్ష్మినర్సు సర్పంచ్ ఎన్నారం ప్రభుత్వం డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసింది కానీ చెత్త బండ్లను ఇవ్వడం మరిచింది. గ్రామాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు చేరవేయాలనేది మంచి ఆలోచన. ప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లు చెత్తను చేరవేయడానికి తోపుడు బండ్లను సమకూర్చాలి. -
చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు!
♦ చేవెళ్ల తాగునీటి పథకంలో ♦ రూ.18.29 కోట్లు నిరుపయోగం ♦ ప్రభుత్వ నిర్వాకంపై మండిపడిన ♦ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ♦ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వివరణపై అసంతృప్తి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జలమండలి, గ్రామీణ నీటి సరఫరా విభాగం నిర్వాకం వల్ల రూ.18.29 కోట్ల నిధులు నిరుపయోగంగా మారినట్లు ‘కాగ్’ స్పష్టం చేసింది. చేవెళ్ల ప్రాంతానికి మంజీర? జలాలను తరలింపు పథకంలో అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించిన కాగ్.. సరిపడా నీళ్లులేకున్నా పథకాన్ని చేపట్టడాన్ని తప్పుబట్టింది. బుధవారం శాసనసభలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రవేశపెట్టింది. చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు సమగ్ర రక్షిత నీటి పథకం (సీపీడబ్ల్యూఎస్) కింద తాగునీరు అందించాలని 2008లో అప్పటి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రూ.20 కోట్లను మంజూరు చేసింది. శంకర్పల్లి మండలం సింగాపూర్ జలాశయం మీదుగా ప్రతి రోజు 2,114 కిలోలీటర్ల నీటిని తరలించాలని రూపొందించిన ప్రణాళికకు జలమండలి ఆమోద ముద్ర వేసింది. ఈ - ప్రొక్యూర్మెంట్ విధానంలో ముంబైకి చెందిన ‘ఇండియన్ హ్యుమ్’ పైపుల తయారీ సంస్థకు పనులను కట్టబెట్టింది. జూన్ 2009 నాటికీ పనులను పూర్తి చేయాలని నియామవళిలో ఉన్నా.. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. ఇలా కొనసాగుతూ వచ్చిన పనులను సదరు సంస్థ 2013వ సంవత్సరంలో పూర్తి చేసింది. అయితే, పథకం పనులు పూర్తయినా ఈనాటికీ కూడా చుక్కనీటి సరఫరా జరగలేదని కాగ్ తన పరిశీలనలో తేల్చింది. విచిత్రమేమిటంటే.. సింగాపూర్ జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు జలమండలి అనుమతి నిరాకరించడం. శివారు ప్రాంతాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడం వల్ల ఇక్కడ తాగునీటి అవసరాలు పెరిగిపోతాయని, తద్వారా చేవెళ్లకు నీటి సరఫరాను చేయలేమని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో పునాది రాయి పడి తొమ్మిదేళ్లయినా పథకం ముందుకు సాగలేదు. గుక్కెడు నీటిని సరఫరా చేయకుండా రూ.18.29 కోట్లను బూడిదలో పోసిన పన్నీరులా మార్చినట్లు అభిప్రాయపడింది. ఈ పథకాన్ని వాడుకలోకి తీసుకురాకుండా.. అటు ప్రభుత్వం గానీ, ఇటు జలమండలిని కానీ ప్రయత్నించకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో (ట్రయల్ రన్) ఉందని, 2015వ సంవత్సరం అక్టోబర్ చివరికల్లా వినియోగంలోకి వస్తుందని ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో కాగ్ సంతృప్తి పడలేదు. ప్రస్తుత పరిస్థితులలో చేవెళ్ల ప్రాంతానికి సింగాపూర్ జలాశయం నుంచి నీళ్లివ్వలేమని గతేడాది నవంబర్‌లో జలమండలి మారోమారు స్పష్టం చేసినందున గ్రామీణ నీటి సరఫరా విభాగం వివరణను తోసిపుచ్చింది. ⇒జిల్లాకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలను కాగ్ ఎండట్టింది. రిజిస్ట్రేషన్లు మొదలు స్టాంపు డ్యూటీ, దస్తావేజుల విలువ కేటాయింపులో నిర్లక్ష్యం, మధ్యాహ్న భోజనం, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థలు తదితర అంశాలపై పరిశీలన చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో హరించుకుపోయిందని మండిపడింది. కాగ్ నివేదికలోని అంశాలు మచ్చుకు కొన్ని.... ⇒ ఆస్తుల విలువ తక్కువగా లెక్కించి పన్ను తక్కువగా విధించిన క్రమంలో రంగారెడ్డి తూర్పు విభాగం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, నారపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్ ఎస్ఆర్ఓ కార్యాలయాల పరిధిలో ఏకంగా రూ. 2.5 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ⇒ దస్తావేజులను తప్పుగా వర్గీకరించి స్టాంపు డ్యూటీని తక్కువ చేయడంతో చంపాపేట, ఉప్పల్, వికారాబాద్ ఎస్ఆర్ఓల పరిధిలో ప్రభుత్వానికి రూ. 1.84 కోట్ల ఆదాయం తగ్గిందని నిర్ధారించింది. ⇒ ఆస్తి అంచనాలో తప్పుడు లెక్కలు చూపడం, జీపీఏపై స్టాంపు డ్యూటీ తగ్గించడంతో రంగారెడ్డి, తూర్పు, పశ్చిమ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రూ. 1.12 కోట్ల ఆదాయం పరులపాలైందని కాగ్ ఆగ్రహించింది. ⇒రిజిస్టర్ చేయని వాటిని రిజిస్ట్రేషన్ చేయక నిరాకరించడంతో రూ. 51.53 లక్షల ఆదాయం సర్కారు ఖజానాకు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. ⇒నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న కొన్ని ఎన్జీఓలు ఆడిట్ నివేదికలు సమర్పించక పోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. ⇒ అక్షరాస్యత కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో జిల్లాలో శాతం పెరుగుదల స్థిరంగా ఉందని కాగ్ పేర్కొనగా.. ప్రభుత్వం స్పందిస్తూ ఈ కార్యక్రమాల వేగాన్ని పెంచుతామని ప్రకటించింది. ⇒ తపాలా శాఖ ద్వారా మీ సేవల్ని విస్తృత పర్చాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఆపరేటర్ల మార్పుతో పలు కేంద్రాలు మూతబడినట్లు తెలుస్తోందని కాగ్ పేర్కొంది. ⇒ సమగ్ర నీటియాజమాన్య నిర్వహణ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో 18 ప్రాజెక్టులు అటకెక్కినట్లు కాగ్ గుర్తించింది. ⇒ జిల్లా విద్యాశాఖలో 2014-15 వార్షికంలో కొన్ని కేటగిరీలకు సంబంధించి అదనపు బిల్లులు డ్రా చేసినట్లు కాగ్ వివరించింది. ⇒ జిల్లాలోని 4 ఉప ఖజానా శాఖ కార్యాలయాల పరిధిలో ఏడాది కాలంగా పదవీ విరమణ పొందిన పోలీసులకు సంబంధించి పెన్షన్లు డ్రా చేయడం లేదని, దీంతో వారి స్థితిపై సందిగ్ధత నెలకొందని కాగ్ పేర్కొంది. ⇒ వాణిజ్య పనుల విభాగంలో డీలరు పన్ను చెల్లించకపోవడంతో జీడిమెట్ల, నాచారం డివిజన్లలో రూ. 5.93 కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. ⇒ అంతర్ రాష్ట్ర అమ్మకాలపై రాయితీ రేట్లను తప్పుగా పేర్కొనడంతో కీసర, నాచారం, తార్నాక, సరూర్‌నగర్, డివిజన్లలో రూ. 3.69 కోట్ల నష్టం వాటిల్లిందని వాణిజ్య పన్నుల శాఖపై కాగ్ అక్షింతలు వేసింది. -
కట్టారు.. మరిచారు!!
అక్కరకు రాని చుట్టము.. అన్నట్లు జిల్లాలోని ఊట్కూర్ మండలకేంద్రానికి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్.. పదిహేనేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్టీసీ అధికారుల నిర్లక్షం, ప్రజా ప్రతినిధుల అలసత్వంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణంతో ప్రయాణీకులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. అయితే గ్రామానికి అరకిలోమీటర్ దూరంగా నిర్మించడం కూడా ఈ బస్టాండ్ కు మరో శాపం. రూ. 7.5 లక్షల వ్యయంతో తలపెట్టిన ఈ బస్టాండ్ నిర్మాణానికి నాటి మంత్రి, దివంగత ఎల్కోటి ఎల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయినా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగలేదు. దీంతో ప్రభుత్వ వాహనాలను అక్కడ నిలపడంలేదు. ప్రస్తుతం ఆ ప్రాంగణం బొగ్గు బట్టీ కార్మికులకు ఆవాసంగా మారింది. పాతబస్టాండ్ వద్ద ప్రయాణీకులు ఉండేందుకు కనీసం షెల్టర్‌ను ఏర్పాటు చేసి కొత్త బస్టాండ్ మీదుగా బస్సులు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.