మద్దతు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు | Buying centers for support prices | Sakshi
Sakshi News home page

మద్దతు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు

Published Wed, Mar 28 2018 9:11 AM | Last Updated on Wed, Mar 28 2018 9:17 AM

Buying centers for support prices - Sakshi

కొనుగోళ్లను ప్రారంభిస్తున్న బాపురెడ్డి 

మెట్‌పల్లి(కోరుట్ల): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  మినుములకు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నందున రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

క్వింటాల్‌కు రూ.5400 మద్దతు ధర అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ నల్ల తిరుపతిరెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ మారు మురళీధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ చీటీ వెంకట్రావు, మార్క్‌ఫెడ్‌ డీఎం శ్యాంకుమార్, నాయకులు మారు సాయిరెడ్డి, ఇల్లెందుల శ్రీనివా స్, గురిజెల రాజిరెడ్డి, జావీద్‌ తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement